మోడల్ ఇంట్లో కాల్పులు, కత్తిపోట్లు | Sakshi
Sakshi News home page

మోడల్ ఇంట్లో కాల్పులు, కత్తిపోట్లు

Published Sun, Oct 16 2016 11:05 AM

మోడల్ ఇంట్లో కాల్పులు, కత్తిపోట్లు

లాస్ ఏంజెలిస్లో సూపర్ మోడల్ మిరండా కెర్ నివాసంలో కాల్పుల కలకలం రేగింది. ఓ అగంతకుడు కెర్ ఇంటి ప్రహారీ గోడ దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం గమనించిన సెక్యూరిటీ గార్డు అతనిపై కాల్పులు జరిపాడు. గార్డు నుంచి తప్పించుకునేందుకు అగంతకుడు కత్తితో పొడిచాడు. పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. పరస్పరం తలపడటంతో గార్డు, అగంతకుడు ఇద్దరూ గాయపడ్డారు. పోలీసులు వీరిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఈ ఘటన జరిగినట్టు లాస్ ఏంజెలిస్ పోలీసులు చెప్పారు. కాగా ఆ సమయంలో ఆ భవనంలో ఎవరూ లేరని తెలిపారు.

ఆస్ట్రేలియా సంతతికి చెందిన కెర్ 2010లో హాలీవుడ్ స్టార్ ఒర్లాండో బ్లూమ్ను పెళ్లాడింది. వీరిద్దరికీ ఓ పాప జన్మించింది. కాగా మూడేళ్ల తర్వాత ఇద్దరూ విడిపోయారు. 33 ఏళ్ల కెర్ బ్లూమ్కు దూరంగా ఉంటోంది.

Advertisement
Advertisement