ఐఫోన్7పై యాపిల్ ముందస్తు వార్నింగ్ | Sakshi
Sakshi News home page

ఐఫోన్7పై యాపిల్ ముందస్తు వార్నింగ్

Published Thu, Sep 8 2016 11:32 AM

ఐఫోన్7పై యాపిల్ ముందస్తు వార్నింగ్ - Sakshi

ఐఫోన్7, ఐఫోన్ 7ప్లస్ ఫోన్లను లాంచ్ చేసిన ఒక్కరోజుకే యాపిల్ ఆసక్తికరమైన హెచ్చరికలు చేసింది. ఐఫోన్ 7, ఐఫోన్7 ప్లస్ జెట్ బ్లాక్ వేరియంట్ను చాలా జాగ్రత్తగా వాడాలని ముందస్తు వార్నింగ్ ఇచ్చింది. ఈ వేరియంట్ త్వరగా గీతలు(స్క్రాచ్లు) పడే అవకాశాలున్నాయంటూ హెచ్చరించిన యాపిల్, గీతలు పడకుండా ఉండేందుకు ఈ వేరియంట్కు కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కంపెనీ వెబ్సైట్లో కొత్త ఐఫోన్7 పేజీలో ఈ విషయాలను యాపిల్ వెల్లడించింది. మెరిసే గాడ్జెట్లపై ఎక్కువగా ఆసక్తిచూపే స్మార్ట్ఫోన్ ప్రియుల కోసం ఈ జెట్ బ్లాక్ ఐఫోన్7ను తీసుకొచ్చినట్టు తెలిపింది. ఇతర యాపిల్ అనాడిజైట్ ఉత్పత్తులతో లాగా దీని పైభాగం సమానంగా ఉన్నప్పటికీ, చాలా హార్డ్గా ఉంటుందని యాపిల్ తెలిపింది. తక్కువ రాపిడిలో వాడినప్పుడు ఎక్కువ ప్రకాశవంతంగా వెలుగొందుతుందని పేర్కొంది. 
 
ఐఫోన్ జాగ్రత్తపరుచుకోవడానికి తాము ప్రతిపాదించే వాటిని ఈ ఫోన్కు వాడితే, ఐఫోన్7 జెట్ బ్లాక్ వేరియంట్ను గీతల బారినుంచి తప్పించవచ్చని వెల్లడించింది. ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ కొత్త జెట్ బ్లాక్ వేరియంట్లు 128జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉండనున్నాయి. అదేవిధంగా గోల్డ్, సిల్వర్, రోజ్ గోల్డ్ రంగుల్లో కూడా యాపిల్  ఈ ఫోన్లను తీసుకొచ్చింది. కొత్త బ్లాక్ వేరియంట్ కేవలం 32జీబీ స్టోరేజ్ ఆప్షన్లోనే అందుబాటులో ఉండనుంది. శాన్ఫ్రాన్సిస్కోలోని ఓ ప్రత్యేక ఈవెంట్గా యాపిల్ ఈ ఫోన్లను ఆవిష్కరించింది. అక్టోబర్ 7 నుంచి భారత్లో విక్రయాలు ప్రారంభంకానున్నాయి. వీటి ప్రారంభ ధర ఇండియాలో రూ.60,000గా కంపెనీ నిర్ణయించింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement