ఇరాక్లో ఆస్ట్రేలియన్ కుర్రాడి ఆత్మాహుతి దాడి | Sakshi
Sakshi News home page

ఇరాక్లో ఆస్ట్రేలియన్ కుర్రాడి ఆత్మాహుతి దాడి

Published Mon, Jul 21 2014 11:45 AM

Iraq suicide bomber was Australian teenager

ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరంలో గత వారం ఆత్మాహుతి దాడి చేసినది 18 ఏళ్ల ఆస్ట్రేలియన్ యువకుడని తేలింది. గురువారం నాడు బాగ్దాద్లో గల షోర్జా ప్రాంతంలోని ప్రధాన మార్కెట్ ప్రాంతంలో గల షియా మసీదు సమపీంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది.

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ గ్రేటర్ సిరియా (ఐఎస్ఐఎస్) సంస్థ.. ఈ యువకుడికి అబు బకర్ అల్ ఆస్ట్రేలి అని పేరు పెట్టింది. మెల్బోర్న్ నుంచి వచ్చిన ఈ ఆస్ట్రేలియన్ యువకుడు ఎందుకు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడనే విషయం మాత్రం తెలియరాలేదు. ఇరాక్లో ఆస్ట్రేలియన్లు ఆత్మాహుతి దాడికి పాల్పడటం ఇది రెండోసారి.

Advertisement
Advertisement