స్కై కార్.. సూపర్.. | Sakshi
Sakshi News home page

స్కై కార్.. సూపర్..

Published Sun, Jun 29 2014 9:00 AM

స్కై కార్.. సూపర్..

చూశారా.. గాల్లో ఎలా వెళ్లిపోతున్నాయో.. ప్రస్తుతానికి ఇది డిజైనే అయినా.. 2016లో ఇది మన కళ్ల ముందు సాక్షాత్కరించనుంది. వచ్చే ఏడాది ఇజ్రాయెల్‌లోని ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ క్యాంపస్‌లో ఈ మాగ్నటిక్ స్కైకార్ల వ్యవస్థను నిర్మించనున్నారు. ప్రజారవాణా వ్యవస్థలో మరో ముందడుగుగా భావిస్తున్న ఈ స్కై కార్ల సృష్టికర్త కాలిఫోర్నియా కంపెనీ స్కైట్రాన్. ఒక్కో స్కైకారులో ఇద్దరు కూర్చునే వీలుం టుంది. డ్రైవర్లు ఎవరూ ఉండరు. అంతా కంప్యూటర్ నడిపిస్తుంటుంది. మాగ్నటిక్ ట్రాక్స్ ఆధారంగా ఇవి వెళ్తుంటాయి. మాగ్నటిక్ లెవిటేషన్ అనే టెక్నాలజీని ఉపయోగించి.. ఈ వ్యవస్థను రూపొందించారు. ప్రస్తుతం జపాన్‌లో బుల్లెట్ రైళ్లకు ఇదే పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. స్కైకార్లు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి.

 

భవిష్యత్తులో వీటి వేగాన్ని గంటకు 240 కిలోమీటర్లకు పెంచుతామని స్కైట్రాన్ కంపెనీ చెబుతోంది. ట్రాఫిక్ సమస్యలకు ఇది చక్కని పరిష్కారమంటోంది. స్కైకార్లు విజయవంతమైతే.. ఇజ్రాయెల్‌లోని టెల్ అవివ్ నగరమంతా వీటిని ఏర్పాటు చేయనున్నారు. టికెట్ ధర ఒక్కొక్కరికి రూ.300 వరకూ ఉండవచ్చు.

Advertisement
Advertisement