మాజీ ప్రియురాలి మంచానికి నిప్పు పెట్టాడు | Sakshi
Sakshi News home page

మాజీ ప్రియురాలి మంచానికి నిప్పు పెట్టాడు

Published Wed, Jan 21 2015 4:30 PM

మాజీ ప్రియురాలి మంచానికి నిప్పు పెట్టాడు

దుబాయ్: తన నుంచి విడిపోయిందనే అక్కసుతో మాజీ ప్రియురాలి మంచానికి నిప్పుపెట్టాడో భారతీయుడు. అక్కడితో ఆగకుండా ఆమె బూట్లను బుగ్గి చేశాడు. నిందితుడి పేరు ఏఆర్ అని మాత్రమే స్థానిక మీడియా వెల్లడించింది. జుమీరాహ్ పామ్ ప్రాంతంలోని ఓ హోటల్ లో వెయిటర్ గా పనిచేస్తున్న నిందితుడు గతేడాది అక్టోబర్ లో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. అతడి మాజీ ప్రియురాలు ఫిలిపినా అదే హోటల్ లో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తోంది.

నిందితుడు దొంగతనంగా ఫిలిపినా గదిలోకి ప్రవేశించి ఆమె బూట్లు, మంచానికి నిప్పుపెట్టాడు. ప్రియురాలి ప్రాణానికి అపాయం కలిగించేలా వ్యవహరించినందుకు, ఆమె వస్తువులకు, హోటల్ ఆస్తకి నష్టం కలిగించినందుకు అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో దుబాయ్  కోర్టు ఫిబ్రవరి 8న తీర్పు వెలువరించనుంది.

Advertisement
Advertisement