జియో ఎఫెక్ట్ : మరో విలీనం కన్ఫార్మ్ | Sakshi
Sakshi News home page

జియో ఎఫెక్ట్ : మరో విలీనం కన్ఫార్మ్

Published Thu, Feb 23 2017 9:35 AM

జియో ఎఫెక్ట్ : మరో విలీనం కన్ఫార్మ్

ముంబై:
జియో ఎఫెక్ట్తో టెలికాం ఇండస్ట్రీలో మరో విలీనం కన్ ఫార్మ్ అయిపోయింది. మార్కెట్ విస్తరణలో భాగంగా నార్వేకు చెందిన టెలినార్ కంపెనీ ఇండియా బిజినెస్ లను టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది.  ఈ విషయంపై  భారతీ ఎయిర్ టెల్ గురువారం ఫైనల్ ప్రకటన చేసింది. టెలినార్(ఇండియా) కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను కొనుగోలుచేసేందుకు తాము టెలినార్ సౌత్ ఆసియా ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్తో  ఓ నిర్ణయాత్మక ఒప్పందంలోకి ప్రవేశించామని తెలిపింది. రెగ్యులేటరీ ఫైలింగ్ లో టెలినార్ ఇండియాకు సంబంధించిన ఏడు సర్కిళ్లను కొనుగోలు చేస్తున్నట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ(ఈస్ట్), యూపీ(వెస్ట్), అస్సాంలు ఈ సర్కిళ్లలో ఉన్నాయి. ఎక్కువ జన సాంద్రత కలిగిన సర్కిళ్లను కొనుగోలుచేసి, రెవెన్యూలను భారీగా పెంచుకోవాలని ఎయిర్ టెల్ భావిస్తోంది.
 
అయితే ఎంతమొత్తంలో కొనుగోలు చేయబోతుందో, ఒక్కో షేరుకు ఎంత చెల్లించనుందో బీఎస్ఈ ఫైలింగ్ లో ఎయిర్ టెల్ తెలుపలేదు. అగ్రిమెంట్ ప్రకారం ఎయిర్ టెల్, టెలినార్ ఇండియా విలీనం అయిపోతే, టెలినార్ ఇండియా మొత్తం దాని ఆధీనంలోకి వచ్చేస్తోంది. వొడాఫోన్-ఐడియా విలీనానికి ముందే ఈ కొనుగోలు ఒప్పందాన్ని ఎయిర్ టెల్ పూర్తిచేయాలనుకుంటోంది. సబ్ స్క్రైబర్  బేస్ లో దూసుకెళ్తున్నాంటూ ప్రకటిస్తున్న జియోకూ ఇది షాకివ్వాలనుకుంటోంది. టెలినార్ ఇండియాను తనలో విలీనం చేసుకోవడం వల్ల ఎయిర్ టెల్ అదనంగా 52.5 మిలియన్ యూజర్లను పొందుతోంది. ప్రస్తుతం ఎయిర్ టెల్ కు 269.40 మిలియన్ సబ్స్రైబర్లు ఉన్నారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement