ఉబర్కు గట్టి ఎదురుదెబ్బ | Sakshi
Sakshi News home page

ఉబర్కు గట్టి ఎదురుదెబ్బ

Published Fri, Aug 19 2016 12:22 PM

ఉబర్కు గట్టి ఎదురుదెబ్బ - Sakshi

డ్రైవర్ వర్గీకరణ దావా కేసులో ఉబర్ ఒప్పందానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ దావాలో డ్రైవర్లతో ఉబర్ చేసుకున్న 100 మిలియన్ డాలర్ల(669 కోట్లకు పైగా) ఒప్పందాన్ని శాన్ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ జడ్జి తిరస్కరించారు.  డ్రైవర్లను స్వతంత్ర కాంట్రాక్టర్లుగా కాకుండా ఉద్యోగులుగా వర్గీకరించాలనే వారికి ఈ ఒప్పందం ఆమోదయోగ్యంగా ఉండదని తీర్పు ఇచ్చారు. ఈ మొత్తం డ్రైవర్లు క్లెయిమ్ చేస్తున్న 852 మిలియన్ డాలర్లకంటే చాలా తక్కువగా ఉందని యూఎస్ జిల్లా కోర్టు జడ్జి ఎడ్వర్డ్ చెన్ పేర్కొన్నారు.  డ్రైవర్ వర్గీకరణ దావా కేసులో 84 మిలియన్ డాలర్లను కాలిఫోర్నియా, మాస్సాచుసెట్స్లోని సుమారు 385,000 ప్రస్తుత, మాజీ డ్రైవర్లకు చెల్లించేందుకు ఉబర్ ఓ ఒప్పందానికి వచ్చింది. అయితే దీనిపై ఇరు వర్గాలు సమ్మతించాయని ఉబర్ తన ప్రకటనలో పేర్కొంది. తమ ఒప్పందాన్ని తిరస్కరిస్తూ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై కంపెనీ నిరాశవ్యక్తంచేస్తున్నట్టు తెలిపింది.

తమను ఉద్యోగులుగా వర్గీకరించి న్యాయపరంగా తమకు చెల్లించాల్సిన గ్యాస్, ఫీజుల వ్యయాలు, వాహన నిర్వహణ ఖర్చులను కంపెనీ భరించాలని ఉబర్ డ్రైవర్లు క్లెయిమ్ చేశారు. దేశాల కార్మిక చట్ట ప్రయోజనాలను తాము పొందుతామని వాదిస్తున్నారు. కానీ ఉబర్ డ్రైవర్లను స్వతంత్ర కాంట్రాక్టర్లుగా వర్గీకరించి ఆ ప్రయోజనాలను హరిస్తోంది. ఉబర్ టాక్సీ కంపెనీ కాదని, డ్రైవర్లకు, రైడర్స్కు సర్వీసులను అందించే టెక్నాలజీ కంపెనీ మాత్రమేనని కంపెనీ పేర్కొంటోంది. ఒప్పందంలో భాగంగా డ్రైవర్లకు వారి నైపుణ్యాల గురించి మరింత సమాచారం అందించి, డ్రైవర్ల అసోసియేషన్ ఫండ్ ఏర్పాటుచేస్తామని ఉబర్ అంగీకరించింది.ఈ దావాలో 852 మిలియన్లు డాలర్లుగా ఉన్న నష్టపరిహారాన్ని, 100 మిలియన్ డాలర్లకు తగ్గించి, డ్రైవర్లను స్వతంత్ర కాంట్రాక్టర్లుగా వర్గీకరణ చేస్తున్నట్టు పేర్కొంది.  ఈ పరిష్కారాన్ని భారీ విజయంగా భావించిన ఉబర్ను గందరగోళంలోకి నెడుతూ ఆ ఒప్పందాన్ని యూఎస్ జిల్లా కోర్టు తిరస్కరించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement