మౌలిక వృద్ధి 3.1శాతం | Sakshi
Sakshi News home page

మౌలిక వృద్ధి 3.1శాతం

Published Tue, Sep 3 2013 2:10 AM

మౌలిక వృద్ధి 3.1శాతం - Sakshi

న్యూఢిల్లీ: ఎనిమిది కీలక మౌలిక(కోర్ ఇన్‌ఫ్రా) పరిశ్రమల ఉత్పాదకత జూలై నెలలో 3.1 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే నెలలో 4.5 శాతం వృద్ధితో పోలిస్తే మందగించింది. అయితే, ఈ ఏడాది జూన్‌లో 0.1 శాతం నామమాత్ర వృద్ధిరేటుతో చూస్తే.. భారీగానే పుంజుకోవడం గమనార్హం. తాజా వృద్ధి రేటు నాలుగు నెలల గరిష్టమే అయినా.. దీన్ని టర్న్‌అరౌండ్‌గా భావించలేమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదే ధోరణి రెండుమూడు నెలలు కొనసాగితే అప్పుడు పుంజుకుంటున్నట్లుగా భావించగలమని క్రిసిల్ ప్రిన్సిపల్ ఎకనమిస్ట్ డీకే జోషి అభిప్రాయపడ్డారు. 
 
 కోర్ ఇన్‌ఫ్రా రంగాల జాబితాలో బొగ్గు, విద్యుత్, పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు, ముడిచమురు, సహజవాయువు, ఎరువులు, సిమెంట్, ఉక్కు ఉన్నాయి. కాగా, జూలైలో ముడిచమురు ఉత్పాదకత మైనస్ 2.3 శాతం, గ్యాస్ ఉత్పత్తి ఏకంగా మైనస్ 16.1 శాతం కుంగడం ఇన్‌ఫ్రా వృద్ధిని వెనక్కిలాగింది. ఈ ఎనిమిది కీలక రంగాలకు పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ)లో 38 శాతం వెయిటేజీ ఉంది. ఈ నేపథ్యంలో రానున్న ఐఐపీ గణాంకాల్లో దీని ప్రభావం ఉంటుంది.
 

Advertisement
Advertisement