Sakshi News home page

ఎమ్మెల్యే కాళ్లుపట్టుకున్న ప్రభుత్వ ఉద్యోగి

Published Sat, Jan 21 2017 5:32 PM

ఎమ్మెల్యే కాళ్లుపట్టుకున్న ప్రభుత్వ ఉద్యోగి

నాగావ్‌: కార్యాలయ గేటుకు అడ్డుగా నిలిపిన ఎమ్మెల్యే కారును అక్కడి నుంచి తొలగించినందుకు ఓ ప్రభుత్వ ఉద్యోగి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలో గల నాగావ్‌ జిల్లా రాహా నియోజకవర్గంలో చోటు చేసుకుంది. కొటియాటోలి డెవలప్‌మెంట్‌ బ్లాక్‌లో జయంత దాస్‌ జూనియర్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యే దింబేశ్వర్‌ దాస్‌ ఇన్‌స్పెక్షన్‌కు కొటియాటోలి డెవలప్‌మెంట్‌ బ్లాక్‌కు వెళ్లారు.
 
ఈ సమయంలో కారును కార్యాలయ ద్వారానికి అడ్డంగా నిలిపేశారు. ఇది గమనించిన జయంత దాస్‌ కారును గేటుకు అడ్డంగా తీసేయించినట్లు సమాచారం. దీంతో జయంతపై కోపగించుకున్న ఎమ్మెల్యే అనుచరులు ఆయనకు జరిగిన విషయాన్ని చెప్పారు. ఆగ్రహించిన ఎమ్మెల్యే ఇంజనీర్‌ను ఇష్టం వచ్చినట్లు తిట్టారు. దాంతో క్షమించాలంటూ జయంత ఎమ్మెల్యే కాళ్లు పట్టుకున్నారు. ఈ ఘటనను మొత్తం టీవీ చానెళ్లు చిత్రీకరించాయి. కాగా, ఇంజనీర్‌తో కాళ్లు పట్టించుకోవడంపై ఎమ్మెల్యేను మీడియా ప్రశ్నించగా అలాంటిదేం జరగలేదని దింబేశ్వర్‌ సమాధానం ఇచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement