రోజూ ఇదే పనేంటి మీకు? | Sakshi
Sakshi News home page

రోజూ ఇదే పనేంటి మీకు?

Published Wed, Sep 2 2015 9:52 AM

రోజూ ఇదే పనేంటి మీకు? - Sakshi

హైదరాబాద్: దేని కోసం సభను అడ్డుకుంటున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పశ్నించారు. అసెంబ్లీ లాబీలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోను ఎవరికీ చెప్పకుండా తొలగించడాన్ని నిరసిస్తూ సభలో వైఎస్సార్ సీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు, ఫోటోలతో నిరసన తెలిపారు.

దీనిపై స్పీకర్ స్పందిస్తూ... రోజూ ఇదే పనేంటి మీకు?సభ సజావుగా నడవాలనుకుంటే సంప్రదాయాలు పాటించండి. ముందు ప్లకార్డులు, ఫోటోలు తీసేసి తర్వాత మాట్లాండి. నిబంధనలకు అనుగుణంగా చర్చకు నోటీసు ఇచ్చారా, వాయిదా తీర్మానం ఎందుకు ఇవ్వలేదు. ఒక అంశం ప్రస్తావనకు రావాటంటే ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, చర్చ రూపంలోనే తెచ్చేవారు. వైఎస్సార్ అంటే గౌరవం ఉంటే వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చేవారు. నిబంధనల ప్రకారం నోటీసు ఇస్తే చర్చించేందుకు అభ్యంతరం లేదు' అని కోడెల అన్నారు.

మహానేత ఫోటోను యధాస్థానంలో పెట్టాలని వైఎస్సార్ సీపీ సభ్యులు గట్టిగా డిమాండ్ చేయడంతో సభను స్పీకర్ 10 నిమిషాలు పాటు వాయిదా వేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement