ఈ-కామర్స్‌ను మించనున్న ఎం-కామర్స్ | Sakshi
Sakshi News home page

ఈ-కామర్స్‌ను మించనున్న ఎం-కామర్స్

Published Mon, Mar 30 2015 12:26 AM

ఈ-కామర్స్‌ను మించనున్న ఎం-కామర్స్

 పెరుగుతున్న మొబైల్ యాప్‌ల డౌన్‌లోడ్
   వీటిల్లో అధికం షాపింగ్ యాప్‌లే
   కేపీఎంజీ నివేదిక వెల్లడి...
 
 ముంబై: మొబైల్ కామర్స్ జోరు అంతకంతకూ పెరిగిపోతోంది. కొన్నేళ్లలో ఈ ఎం-కామర్స్, ఈ-కామర్స్‌ను అధిగమిస్తుందని కేపీఎంజీ తాజా నివేదిక వెల్లడించింది. ఆన్‌లైన్ షాపింగ్ పెరుగుతుండడం, మొబైల్ యాప్‌ల వినియోగం కూడా జోరందుకోవడం  దీనికి ప్రధాన కారణాలంటున్న ఈ నివేదిక వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు...
 
 ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో మొబైల్ ఫోన్‌ల వినియోగదారులు 900 కోట్ల మొబైల్ యాప్‌లు  డౌన్‌లోడ్ చేసుకుంటారని అంచనా. గతేడాది డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌ల కంటే ఆరు రెట్లు అధికం.
 డౌన్‌లోడ్ చేసుకుంటున్న మొబైల్ యాప్‌ల్లో అధికంగా షాపింగ్ యాప్‌లే ఉంటున్నాయి.
 గత రెండేళ్లలో అత్యంత వేగంగా వృద్ధి చెందిన మొబైల్ యాప్‌ల మార్కెట్‌గా భారత్ ఎదిగింది.
 మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే మొబైల్ యాప్‌ల డౌన్‌లోడ్ విషయంలో భారత్ వాటా 7 శాతంగా ఉంది.
 
 మొబైల్ యాప్‌ల డౌన్‌లోడ్ విషయంలో ఇండోనే సియా, చైనా, అమెరికాల తర్వాతి స్థానం మనదే.
 భారత్‌లో మొబైళ్ల ద్వారా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసిన వాళ్లు 2014లో 17.3 కోట్లుగా ఉన్నారు. గత ఏడాదితో పోల్చితే ఇది 33 శాతం ఎక్కువ.
 
 ఇలా మొబైళ్ల ద్వారా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసే వారి సంఖ్య ప్రతీ ఏడాది 21 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని,  2019లో ఈ సంఖ్య 45.7 కోట్లకు పెరుగుతుందని అంచనా. మొబైళ్ల ద్వారా జరుగుతున్న ఈ-కామర్స్ పోర్టళ్ల షాపింగ్ లావాదేవీలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీంతో మొబైల్ ప్లాట్‌ఫామ్‌పైనే ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఈ-కామర్స్ పోర్టళ్లు యోచిస్తున్నాయి.
 

Advertisement
Advertisement