నెస్లే ఇండియాకు మ్యాగీ దెబ్బ | Sakshi
Sakshi News home page

నెస్లే ఇండియాకు మ్యాగీ దెబ్బ

Published Fri, Oct 30 2015 1:32 AM

నెస్లే ఇండియాకు మ్యాగీ దెబ్బ - Sakshi

15 ఏళ్లలో తొలిసారి నష్టాలు

న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్‌పై నిషేధం నెస్లే ఇండియాపై తీవ్రమైన ప్రభావాన్నే చూపింది. జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు రూ.64 కోట్ల నష్టాలొచ్చాయని (స్టాండ్‌ఎలోన్) నెస్లే ఇండియా తెలిపింది. ఒక క్వార్టర్‌లో నష్టాలు రావడం  15 ఏళ్లలో ఇదే మొదటిసారి. కన్సాలిడేటెడ్‌గా చేస్తే ఈ కంపెనీ నికర లాభం సెప్టెంబర్ త్రైమాసిక కాలంలో 60% తగ్గింది.

అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు రూ. 311 కోట్లుగా ఉన్న తమ నికర లాభం ఈ క్యూ3లో రూ.124 కోట్లకు తగ్గిందని నెస్లే ఇండియా ఎండీ నారాయణన్ చెప్పారు.  నికర అమ్మకాలు రూ.2,558 కోట్ల నుంచి 32 శాతం క్షీణించి రూ.1,736 కోట్లకు తగ్గాయని  పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement