ఇరాన్ లో భారీ భూకంపం! | Sakshi
Sakshi News home page

ఇరాన్ లో భారీ భూకంపం!

Published Mon, Aug 18 2014 1:38 PM

Major quake jolts Iranian city

టెహ్రాన్: ఇరాన్ లోని అబ్దానన్ నగరాన్ని సోమవారం ఉదయం భూకంపం కుదిపేసింది. దక్షిణ ఇరాన్ లోని ఇయామ్ ప్రాంతంలోని అబ్దానన్ నగరంలో చోటు చేసుకున్న భారీ భూకంపం రెక్టర్ స్కేల్ పై 6.1 గా నమోదైంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 60 మంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. 
 
భూకంప ప్రభావం లోరస్టాన్, ఖుజెస్థాన్, మార్కాజీ ప్రాంతాలపై కూడా ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. ఈ భూకంపం సోమవారం ఉదయం 7 గంటలకు చోటు చేసుకున్నట్టు సమాచారం. భూకంపం తాకిడికి విద్యుత్, టెలిఫోన్, నీటి సరఫరా స్థంభించినట్టు అధికారులు తెలిపారు.
 
2003 డిసెంబర్ లో ఇరాన్ లోని కెర్మాన్ ప్రాంతంలోని బామ్ లో చోటు చేసుకున్న భూకంప ప్రమాదంలో 31 వేల మంది మరణించారు. అప్పట్లో భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. 1990 జరిగిన భూకంప ప్రమాదంలో 37 వేల మంది మరణించారు. 

Advertisement
Advertisement