లిక్కర్‌ కింగ్‌ మాల్యాకు ఇక గడ్డుకాలమే! | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ కింగ్‌ మాల్యాకు ఇక గడ్డుకాలమే!

Published Thu, May 4 2017 1:39 PM

లిక్కర్‌ కింగ్‌ మాల్యాకు ఇక గడ్డుకాలమే! - Sakshi

న్యూఢిల్లీ:  భారీరుణ ఎగవేతదారుడు, పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించే ప్రయత్నాల్లో భారత విచారణ అధికారులు మరో కీలక అడుగు  ముందుకు వేశారు.  బ్యాంకులకు  వేలకోట్ల రూపాయల రుణాలను  ఎగవేసి  లండన్‌కు పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్‌మాల్యాను  భారత్‌ కు అప్పగించేందుకు   బ్రిటన్‌ అధికారులు  గ్రీన్‌  సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మేరకు  అత్యున్నత స్థాయి అధికారుల మధ్య జరిగిన సమావేశంలో అంగీకారం కుదిరింది.  మాల్యాను ఇండియాకు పంపించేందుకు భారతదేశం , యూకే మధ్య పరస్పర మార్పిడి చట్టాలకు లోబడి పూర్తి సహాయ సహకారాలు అందించేందకు అంగీకరించారు.  ఈ మేరకు భారత  నిబంధనలకు బ్రిటన్‌ అధికారులు అంగీకరించారు. దీంతో పాటు  ఇరు దేశాల మధ్య పెండింగ్‌ లో ఉన్న మిగతా కేసుల్లో కూడా పరస్పరం సహకరించుకునేందుక ఇరుదేశాలు అంగీకరిచాయి. ఈ మేరకు జూన్‌లో  ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి.

మాల్యాను రప్పించే విషయంలో భారత నిబంధనలకు  యూకే అధికారుల ఆమోదం మంచి పరిణామమని ఎనలిస్టులు వ్యాఖ్యానించారు.

కాగా  మాల్యా వ్యవహారంలో ఎన్‌ఫోర్సెమెంట్ డైరెక్టరేట్ (ఇడి) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సీనియర్ అధికారుల ప్రత్యేక బృందం  లండన్‌ చేరుకుంది. అక్కడి న్యాయవాదులతోపాటు,ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శులు  రాజీవ్ మెహ్రిషి , అంబర్ రుద్ల  చర్చలు జరపుతోంది.  ఇటీవల లండన్‌ లో అరెస్ట్‌ చేసిన విజయ్ మాల్యాకు బెయిల్‌ మంజూరైంది. ఈ కేసు మే 17న విచారణకు రానున్న సంగతి తెలిసిందే.  
 

Advertisement
Advertisement