ఈ దేశ భవిష్యత్తు ఏమౌతుందో? | Sakshi
Sakshi News home page

ఈ దేశ భవిష్యత్తు ఏమౌతుందో?

Published Thu, Aug 7 2014 8:00 PM

ఈ దేశ భవిష్యత్తు ఏమౌతుందో? - Sakshi

కోల్ కతా: రక్షణ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ ఏ దిశగా పయనిస్తుందో అర్ధం కావడం లేదని మమత ఎద్దేవా చేశారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను దేశంలోని కీలకమైన రక్షణ, రైల్వేల్లోకి ఆహ్వానించడాన్ని తప్పుబట్టారు. గురువారం మోడీ ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు. రక్షణ రంగంలోకి 26 శాతం నుంచి 49 శాతం పెట్టుబడులను స్వాగతించిన మోడీ కేబినెట్.. దేశ భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చిందని మండిపడ్డారు.

 

రైల్వేలోకి 100 శాతం పెట్టుబడులను, రక్షణ రంగంలో అందులో సగం పెట్టుబడులను కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో దేశంలోని సురక్షిత, భద్రతలకు సంబంధించి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. గతంలో రైల్వే శాఖ మంత్రిగా పని చేసిన మమత ఈ వ్యాఖ్యలను తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.అసలు ముందు ముందు దేశ భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement