ఉద్యోగం ఇవ్వనోళ్లకి.. పిల్లి పెంట బహుమానం | Sakshi
Sakshi News home page

ఉద్యోగం ఇవ్వనోళ్లకి.. పిల్లి పెంట బహుమానం

Published Thu, Feb 13 2014 1:20 AM

ఉద్యోగం ఇవ్వనోళ్లకి.. పిల్లి పెంట బహుమానం

వాషింగ్టన్: ఏదైనా కంపెనీ ఉద్యోగం ఇవ్వకపోతే ఎవరైనా ఏంచేస్తారు? కంపెనీ వాళ్లని తిట్టుకుంటారు. లేదంటే మనకి అదృష్టం లేదని సరిపెట్టుకుంటారు. కానీ ఉద్యోగవేటలో విసుగెత్తిపోయిన 58 ఏళ్ల జెవాన్స్ బ్రౌన్ అలాంటి కంపెనీలపై కసి తీర్చుకున్నాడు. అదీ ఆషామాషీగా కాదు. సంచులకొద్దీ పిల్లి పెంటను ఆ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు పోస్టులో పంపి.
 
  అమెరికా రాష్ట్రం మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో నివసించే బ్రౌన్ గడచిన ఆగస్టులో ఈ పని చేశాడు. అయితే ఇలాంటి పని చట్టవిరుద్ధమన్న స్థానిక కోర్టు ఈ మాజీ సైనికోద్యోగిని రెండేళ్లు పరిశీలనలో ఉంచాలని గతవారంలో తీర్పిచ్చింది. బ్రౌన్ చర్య వల్ల తపాలా ఉద్యోగులు, ఆ సంచులను అందుకున్న వాళ్లు, ఇతర వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడుతుందని కోర్టు పేర్కొంది. కొసమెరుపేంటంటే.. ఈ మధ్యనే బ్రౌన్‌కు ఒక కంపెనీలో ఉద్యోగం దొరకడం.

Advertisement
Advertisement