గుడ్డలూడదీసి నగ్నంగా తిప్పారు! | Sakshi
Sakshi News home page

గుడ్డలూడదీసి నగ్నంగా తిప్పారు!

Published Wed, Aug 2 2017 1:23 PM

గుడ్డలూడదీసి నగ్నంగా తిప్పారు! - Sakshi

జార్ఖండ్‌లో దారుణం

మరో మతానికి చెందిన మహిళతో సన్నిహితంగా గడిపినందుకు జార్ఖండ్‌లో ఓ వ్యక్తిని దుస్తులు ఊడదీసి.. నగ్నంగా ఊరేగించారు. అతనిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

మహమ్మద్‌ షకీర్‌ అనే వ్యక్తి జార్ఖండ్‌ బోకారో జిల్లాలోని ప్రగ్యా సెంటర్‌లో పనిచేస్తున్నాడు. అతను మంగళవారం మరో మతం మహిళతో కార్యాలయంలో సన్నిహితంగా గడుపుతూ పట్టుబడ్డాడు. దీంతో ఒక్కసారిగా పోగైన జనం అతన్ని కార్యాలయం నుంచి బయటకీడ్చుకొచ్చి.. దాడి చేశారు. అతన్ని గుడ్డలూడదీసి.. నగ్నంగా సమీపంలో ఉన్న మార్కెట్‌ చుట్టూ ఊరేగించారు. అతన్ని తీవ్రంగా కొట్టారు. దీంతో తీవ్ర గాయాలైన అతన్ని ఆస్పత్రికి తరలించారు. భారీ మూగిన మూకను నియంత్రించి.. అతన్ని ఆస్పత్రికి తీసుకురావడం ఓ దశలో పోలీసులకు కష్టసాధ్యంగా కనిపించింది. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతలు రేపింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి .. మంతు యాదవ్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మరింతమందిని అరెస్టుచేస్తామని పోలీసులు చెప్తున్నారు.
 

Advertisement
Advertisement