వేధింపుల కేసులో బాక్సర్‌ డింకో సింగ్‌ అరెస్ట్ | Sakshi
Sakshi News home page

వేధింపుల కేసులో బాక్సర్‌ డింకో సింగ్‌ అరెస్ట్

Published Fri, Jan 17 2014 2:44 PM

వేధింపుల కేసులో బాక్సర్‌ డింకో సింగ్‌ అరెస్ట్ - Sakshi

ఇంపాల్ : ఏషియన్‌ గేమ్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌, బాక్సర్‌ డింకో సింగ్‌ను మణిపూర్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ మహిళా వెయిట్‌ లిఫ్టర్‌ను వేధించాడన్న ఆరోపణలపై డింకోను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. కోర్టు ముందు హాజరు పరచనున్నారు. ఇంపాల్‌లోని లంపాక్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఈ నెల 13న 17 ఏళ్ల మహిళా వెయిట్‌ లిఫ్టర్‌ను డింకో వేధించాడు.

అతని కారుపై ఓజా డింకో అని రాసినందుకు తనను కర్రతో తీవ్రంగా కొట్టాడని సదరు లిఫ్టర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ మహిళా లిఫ్టర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 1998లో జరిగిన ఏషియన్‌ గేమ్స్‌లో డింకో సింగ్‌ గోల్డ్‌ మెడల్‌ గెలిచి పేరు సంపాదించాడు.  అనంతరం అతన్ని కేంద్రం అర్జున, పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది. గతేడాది స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా.. అతన్ని కోచ్‌గా నియమించింది. అలాంటి వ్యక్తి ఇంటువంచి చర్యలకు పాల్పడటాన్ని వెయిట్‌లిఫ్టింగ్‌ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. డింకోపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement