మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు ఖరారు | Sakshi
Sakshi News home page

మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు ఖరారు

Published Wed, Sep 23 2015 12:35 AM

మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు ఖరారు - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో నామినేటెడ్ పదవుల భర్తీకి మార్గం సుగమమైంది. ఈ కమిటీల చైర్మన్ పదవుల్లో తొలిసారిగా రిజర్వేషన్‌ను అమలుచేస్తూ కేటగిరీల వారీగా కోటాను ఖరారు చేశారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి చైర్మన్‌గా, మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ శరత్, అదనపు డెరైక్టర్ లక్ష్మీబాయి, వ్యవసాయ శాఖ డిప్యూటీ కార్యదర్శి సూర్యప్రభ సభ్యులుగా ఉన్న ఈ కమిటీలాటరీ విధానంలో మార్కెట్ కమిటీల రిజర్వేషన్లను ఎంపిక చేసింది. రాష్ట్రంలో మొత్తం 179 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా...

పీసా చట్టం ప్రకారం ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో షెడ్యూల్డ్ ఏరియాలోని 11 కమిటీలను ఎస్టీలకు కేటాయించారు. మిగతా 168 మార్కెట్ కమిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ ఎస్టీలకు 6, ఎస్సీలకు 15, బీసీలకు 29 శాతం చొప్పున చైర్మన్ పదవులు కేటాయించారు. మిగతా 84 కమిటీలను అన్ రిజర్వుడు (ఓసీ)గా ఖరారు చేశారు. మార్కెట్ కమిటీల రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల తర్వా త నూతన పాలక మండళ్లు ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. మార్కెట్ కమిటీల పదవీ కాలం ఏడాదికాగా... కమిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు 14 మంది సభ్యులు ఉంటారు.
 
బీసీ రిజర్వుడు కమిటీలు..
ఆదిలాబాద్ జిల్లాలోని లక్సెట్టిపేట, చెన్నూరు, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, కుభీర్, సారంగాపూర్, జన్నారం; హైదరాబాద్ జిల్లా పరిధిలోని గడ్డిఅన్నారం, బోయిన్‌పల్లి; కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, పెద్దపల్లి, వేములవాడ, జగిత్యాల, గంగాధర, ధర్మారం, పోత్గల్ (ముస్తాబాద్), మంథని, మల్లాపూర్, ఇల్లంతకుంట, రాయికల్, గంభీరావుపేట; ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, కల్లూరు; మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట, అచ్చంపేట, మక్తల్, ఆత్మకూరు; మెదక్ జిల్లాలోని సదాశివపేట, వంటిమామిడి, జోగిపేట, నంగునూరు; నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, వలిగొండ, ఆలేరు; నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్, కామారెడ్డి, కమ్మర్‌పల్లి, సదాశివనగర్, బిచ్కుంద; రంగారెడ్డి జిల్లాలోని పరిగి, శంకర్‌పల్లి, చేవెళ్ల, సర్దార్‌నగర్, బషీరాబాద్; వరంగల్ జిల్లాలోని వరంగల్, నర్సంపేట, చేర్యాల, నెక్కొండ, కొడకండ్ల కమిటీలు.
 
ఎస్సీ రిజర్వుడు కమిటీలు
ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా; హైదరాబాద్ జిల్లాలోని గుడిమల్కాపూర్; కరీంనగర్ జిల్లాలోని సుల్తానాబాద్, హుస్నాబాద్, మెట్‌పల్లి, మానకొండూరు, కథలాపూర్, మేడిపల్లి, ఆర్.బొప్పాపూర్, కోహెడ, రుద్రంగి, జూలపల్లి, గోపాల్‌రావుపేట, వెల్గటూరు; మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి టౌన్; మెదక్ జిల్లాలోని తొగుట; నల్లగొండ జిల్లాలోని హుజూర్‌నగర్, మోత్కూరు; రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్, నార్సింగి, కోట్‌పల్లి; వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, ఆత్మకూరు కమిటీలు
 
ఎస్టీ రిజర్వుడ్ కమిటీలు
కరీంనగర్ జిల్లాలోని గొల్లపల్లి; ఖమ్మం జిల్లాలోని వైరా; మెదక్ జిల్లాలోని నర్సాపూర్, పాపన్నపేట; నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, భువనగిరి, నకిరేకల్, చండూరు; నిజామాబాద్ జిల్లాలోని వేల్పూరు; రంగారెడ్డి జిల్లాలోని ధారూరు కమిటీలు.
 
అన్ రిజర్వుడు కమిటీలు..
ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, బోథ్, మంచిర్యాల, జైనథ్, నిర్మల్, ఖానాపూర్; హైదరాబాద్ జిల్లా పరిధిలో హైదరాబాద్; కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, ధర్మపురి, సిరిసిల్ల, కోరుట్ల, మల్యాల, కాటారం, ఇబ్రహీంపట్నం, పెగడపల్లి, బెజ్జంకి, కమాన్‌పూర్, శ్రీరాంపూర్; ఖమ్మం జిల్లాలో మధిర, నేలకొండపల్లి, సత్తుపల్లి; మహబూబ్‌నగర్ జిల్లాలో మహబూబ్‌నగర్, గద్వాల, బాదేపల్లి, కల్వకుర్తి, కోస్గి, ఆమన్‌గల్, వనపర్తి రోడ్, ఆలంపూర్, దేవరకద్ర, కొల్లాపూర్, నవాబ్‌పేట, పెబ్బేరు; మెదక్ జిల్లాలో మెదక్, గజ్వేల్, సిద్దిపేట, జహీరాబాద్, రామాయంపేట, దుబ్బాక, నారాయణఖేడ్, రాయికోడ్, సంగారెడ్డి, వట్‌పల్లి, చేగుంట, మిర్‌దొడ్డి, దౌల్తాబాద్, కొండపాక, చిన్నకోడూరు; నల్లగొండ జిల్లా నల్లగొండ, దేవరకొండ, కోదాడ, తుంగతుర్తి(తిరుమలగిరి), హాలియా, వెంకటేశ్వరనగర్, నిడమనూరు, చిట్యాల, నేరేడుచర్ల, చౌటుప్పల్; నిజామాబాద్ జిల్లాలో మద్నూరు, బాన్స్‌వాడ, బోధన్, వర్ని, ఆర్మూరు, పిట్లం, ఎల్లారెడ్డి, గాంధారి, బిక్నూరు, కోట గిరి, బీర్కూర్; రంగారెడ్డి జిల్లాలో తాండూరు, ఇబ్రహీంపట్నం, వికారాబాద్, మర్పల్లి, మహేశ్వరం, కుల్కచర్ల; వరంగల్ జిల్లాలో జనగాం, కేసముద్రం, పర్కాల, తొర్రూరు, ఘనపూర్ (స్టేషన్), వర్ధన్నపేట.

Advertisement
Advertisement