ఫ్లాట్‌గా మార్కెట్లు:ఇన్ఫోసిస్‌ టాప్‌ లూజర్‌ | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌గా మార్కెట్లు:ఇన్ఫోసిస్‌ టాప్‌ లూజర్‌

Published Tue, Mar 7 2017 10:02 AM

Markets off to a tepid start on global cues; Infosys top loser

ముంబై: ప్రపంచ మార్కెట్ల బలహీనతలనేపథ్యంలో దేశీ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలయ్యాయి.  ఆరంభంనుంచి కొద్దిగా పుంజకున్న సెన్సెక్స్‌ 40 పాయింట్లు పెరిగి 29,088వద్ద నిఫ్టీ 6 పాయింట్లు బలపడి 8,969 వద్ద ట్రేడవుతోంది.  ఐటీ  వీక్‌నెస్‌ ఈరోజుకూడా కొనసాగుతోంది.  మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌  నామమాత్రపులాభాల్లోనూ, పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌   స్వల్ప లాభాల్లో ఉంది.  టెక్‌ మహీంద్రా, ఆర్‌ఐఎల్‌, బీపీసీఎల్‌, ఐషర్‌, టాటా పవర్‌ లాభపడగా, ఇన్ఫోసిస్‌ 1.6 శాతం నష్టాలతో టాప్‌ లూజర్‌గా ఉంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, ఆర్‌ఐఎల్‌, బీపీసీఎల్‌, పవర్‌గ్రిడ్‌, గెయిల్‌, ఐషర్‌, టాటా పవర్‌ లాభపడగా.. ఇన్ఫోసిస్‌ 1.6 శాతం  నష్టాలతో టాప్‌ లూజర్‌గా ఉంది.  టాటా మోటార్స్‌ భారతి ఎయిర్‌టెల్‌, హిందాల్కో, హీరోమోటో, ఇండస్‌ఇండ్‌, యస్‌బ్యాంక్‌ నష్టాల్లో కొనసాగుతున్నాయి.


జాగరణ్‌ ప్రకాశన్‌ గ్రూప్‌ సంస్థ రేడియో సిటీ పబ్లిక్‌ ఇష్యూ  మొదిటి రోజు(సోమవారం) 51 శాతం సబ్‌స్ర్కయిబ్‌ అయ్యింది. రేపు(బుధవారం) ఈ ఇష్యూ ముగియనుండగా.. డీమార్ట్‌ స్టోర్ల నిర్వహణ సంస్థ అవెన్యూ సూపర్‌మార్ట్‌ ఐపీవో మొదలుకానుంది. కాగా, దేశీ స్టాక్స్‌లో మళ్లీ ఎఫ్‌ఐఐలు పెట్టుబాట పట్టారు. నగదు విభాగంలో సోమవారం ఎఫ్‌ఐఐలు రూ. 564 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. అయితే శుక్రవారం రూ. 737 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన దేశీఫండ్స్‌ సోమవారం కూడా దాదాపు రూ. 482కోట్ల పెట్టుబడులను  ఉపసంహరించుకున్నాయి.

అటు డాలర్‌ మారకంలో రూపాయి 0.18 పైసలు బలపడి 66.62వద్ద ఉంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌ లో పుత్తడి  పది గ్రా.87రూపాయలు క్షీణించి, రూ.29,933 వద్ద ఉంది.
 

Advertisement
Advertisement