Sakshi News home page

విద్యార్థుల కోసం మైక్రోసాఫ్ట్ ప్రత్యేక టాబ్లెట్

Published Fri, Feb 7 2014 1:09 AM

విద్యార్థుల కోసం  మైక్రోసాఫ్ట్ ప్రత్యేక టాబ్లెట్

 న్యూఢిల్లీ: ప్రైవేటు స్కూళ్ల కోసం పలు ఆధునిక ఫీచర్లతో కూడిన ప్రత్యేక ట్యాబ్లెట్‌ను సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గురువారం ఆవిష్కరించింది. ఏసర్, ఎంబీడీ గ్రూప్, టాటా టెలిసర్వీసెస్‌లతో కలసి రూపొందించిన దీని ధర రూ. 24,999. దేశంలోని అన్ని ప్రైవేటు స్కూళ్లకూ దీన్ని అందుబాటులో ఉంచారు.

అత్యాధునిక క్వాడ్‌కోర్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ విండోస్ 8.1 ట్యాబ్లెట్లో హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే ఉంటుందని మైక్రోసాఫ్ట్ ఇండియా గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎండలో సైతం చదవడానికి హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే దోహదపడుతుంది. ఆఫీస్ 365 ఎడ్యుకేషన్ ఏ2, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్ట్ (ఎంఓఎస్) సర్టిఫికేషన్లను  ఇందులో చేర్చారు. వివిధ రాష్ట్రాల బోర్డులు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈల కోసం ఎంబీడీ పబ్లిషింగ్ హౌస్ రూపొందించిన డిజిటల్ లెర్నింగ్ కరిక్యులమ్‌ను కూడా ఈ టాబ్లెట్‌లో పొందుపర్చారు.

Advertisement
Advertisement