Sakshi News home page

మిషన్ హరితాంధ్రప్రదేశ్ మొదలైంది: సీఎం చంద్రబాబు

Published Wed, Jul 20 2016 10:07 PM

మిషన్ హరితాంధ్రప్రదేశ్ మొదలైంది: సీఎం చంద్రబాబు - Sakshi

విజయవాడ: తెలంగాణలో నిర్వహించిన హరితహారం తరహాలో ఆంధ్రప్రదేశ్ లోనూ ఒకే రోజు భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మిషన్ హరితాంధ్రప్రదేశ్ లో భాగంగా 'వనం- మనం' పేరుతో నిర్వహించనున్న కార్యక్రమం వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం విజయవాడలో వెల్లడించారు.

మిషన్ హరితాంధ్రప్రదేశ్ ను ప్రారంభిస్తున్నామని, ఈ నెల(జులై) 29న రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రతిఒక్కరూ 'వనం- మనం'లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నాటిన పతి మొక్కను సంరక్షించి, దాని ఎదుగుదలను పర్యవేక్షించే బాధ్యత ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులదేనని, అన్ని మొక్కలకు జియో ట్యాగింగ్ జియో ఫెన్సింగ్ ఏర్పాటుచేస్తామని సీఎం పేర్కొన్నారు. ఎర్రచందనం కలప అమ్మకాల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుచేస్తున్నట్లు, తద్వారా అమ్మకాలు పారదర్శకంగా జరుగుతాయన్నారు. ఎర్రచందనం అక్రమరవాణాకు పాల్పడేవారి ఆస్తులు జప్తు చేస్తామని సీఎం హెచ్చరించారు.

Advertisement
Advertisement