'అది అంతర్జాతీయంగా పెద్ద జోక్' | Sakshi
Sakshi News home page

'అది అంతర్జాతీయంగా పెద్ద జోక్'

Published Sat, Jul 18 2015 7:34 PM

'అది అంతర్జాతీయంగా పెద్ద జోక్' - Sakshi

న్యూఢిల్లీ: వరుస కాల్పుల విరమణ ఒప్పందాన్నిఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ పై నరేంద్ర మోదీ సర్కారు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. మోదీ పాలనలో పాకిస్థాన్ సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే అది అంతర్జాతీయంగా పెద్ద జోక్ అవుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆర్పీఎన్ సింగ్ విమర్శించారు. దేశ ప్రధానిగా మోదీ పగ్గాలు చేపట్టి 15 నెలలు కావొస్తున్నా.. పాకిస్థాన్ తన కుటిల యత్నాలను యధేచ్ఛగా కొనసాగిస్తూనే ఉందన్నారు. దీనిపై మోదీ ప్రభుత్వం ఏమి సాధించిందో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో మోదీ తరుచు సమావేశం అవుతున్నా.. వాటి వల్ల సాధించింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.

 

బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో డజన్ల సంఖ్యలో భారత జవాన్లు మృతిచెందగా, 18 మందికి పైగా ప్రజలు అసువులు బాసారన్నారు.  గత యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా  ఉన్న సమయంలో ఏనాడు కూడా పాకిస్థాన్ పర్యటన చేపట్టలేదని ఈ సందర్భంగా ఆర్పీఎన్ సింగ్ పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement