నేతాజీ వారసులను కలుస్తా.. | Sakshi
Sakshi News home page

నేతాజీ వారసులను కలుస్తా..

Published Sun, Sep 20 2015 4:11 PM

నేతాజీ వారసులను కలుస్తా.. - Sakshi

- వచ్చే నెలలో ప్రధాని నివాసంలో  భేటీ కానున్నట్లు వెల్లడించిన మోదీ

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారసులను త్వరలో కలుసుకోనున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ప్రతి నెల మూడో ఆదివారం నిర్వహించే 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. వచ్చే నెల (అక్టోబర్)లో ప్రధాని నివాసంలోనే ఆ సమావేశం ఉండబోతుందన్నారు.

'గత మేలో కోల్కతా వెళ్లినప్పుడు సుభాష్ బాబూ (నేతాజీ) కుటుంబ సంభ్యులు కొందరిని కలిశాను. అందుబాటులో ఉన్న వారసులందరినీ కలుసుకోవాలని అప్పుడే నిర్ణయం జరిగింది. ఆ మేరకు వచ్చే నెలలో ఢిల్లీ రేస్ కోర్స్ రోడ్డులోని ప్రధాని నివాసంలో 50 మందికిపైగా బోస్ వారసులతో భేటీ అవుతున్నా' అని మోదీ పేర్కొన్నారు.

దశాబ్ధాలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరతీస్తూ నేతాజీ అంతర్ధానానికి సంబంధించిన రహస్య ఫైళ్లను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఇటీవలే బయటపెట్టడం, కేంద్రం కూడా తన వద్ద ఉన్న ఫైళ్లను వెల్లడించాలని బెంగాల్ సీఎం మమత డిమాండ్ చేయడం తెలిసిందే. ఫైళ్లలోని అంశాలను బట్టి నేతాజీ కుటుంబసభ్యులపై కాంగ్రెస్ ప్రభుత్వాలు గూఢచర్యకు పాల్పడిందని నమ్ముతున్నట్లు ఆయన వారసులు పేర్కొంటున్న తరుణంలో వారితో మోదీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement
Advertisement