చాలారోజులకు పార్టీ కార్యాలయానికి నాగం | Sakshi
Sakshi News home page

చాలారోజులకు పార్టీ కార్యాలయానికి నాగం

Published Thu, Aug 6 2015 11:35 AM

చాలారోజులకు పార్టీ కార్యాలయానికి నాగం - Sakshi

హైదరాబాద్ : బీజేపీ నాయకుడు నాగం జనార్ధన్రెడ్డి గురువారం హైదరాబాద్లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేశారు.  పార్టీ కార్యాలయంలోని నేతలు, కార్యకర్తలతో నాగం భేటీ అయ్యారు. గతేడాది శాసనసభ ఎన్నికల ముందు నాగం టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసీ ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

అలాగే బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రావడం కూడా పూర్తిగా మానివేశారు. ఓ వేళ ప్రెస్ మీట్లు పెట్టాలంటే పార్టీ కార్యాలయంలో కాకుండా ఆయన సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలకు నాగంకు మధ్య పొసగడం లేదని ప్రచారం సాగుతోంది. టీడీపీలో ఉన్నప్పుడు పలు కీలక మంత్రి పదవులు చేపట్టి ఓ వెలుగు వెలిగిన నాగం ఆ తర్వాత కమలతీర్థం పుచ్చుకుని సైలంట్ అయిపోయారని తెలంగాణలో ప్రచారం సాగుతోంది.

Advertisement
Advertisement