'ఆ యూనివర్శిటీ సంస్కృతిలో ఒక భాగం' | Sakshi
Sakshi News home page

'ఆ యూనివర్శిటీ సంస్కృతిలో ఒక భాగం'

Published Fri, Sep 19 2014 7:03 PM

'ఆ యూనివర్శిటీ సంస్కృతిలో ఒక భాగం' - Sakshi

 రాజ్‌గిర్(బీహార్): నలందా విశ్వవిద్యాలయం యూనివర్సిటీ మాత్రమే కాదని, అది సంస్కృతిలో భాగమని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. నలందా విశ్వవిద్యాలయానికి వస్తున్న అద్భుత స్పందన దృష్ట్యా దీనిని కేవలం తూర్పు ఆసియా దేశాల విద్యార్థులకే పరిమితం చేయకుండా, ఇతర దేశాల వారికీ అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు ఆమె స్పష్టం చేశారు. బీహార్‌లో పునరుద్ధరించిన ఈ విశ్వవిద్యాలయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు మధ్య ఇది వారధి వంటిదన్నారు.

 

గతంలో విదేశీ విద్యార్థులను ఆకర్షించడం ద్వారా దేశాన్ని ప్రపంచంతో అనుసంధానం చేసినట్లు చెప్పారు.కేంద్రం ఇప్పటికే రూ.2,727కోట్లు కేటాయించిందని, పదేళ్లలో ఉన్నత తరగతి క్యాంపస్‌గా తీర్చిదిద్దేందుకు ఈ నిధులను వెచ్చించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీహార్ సీఎం జితన్‌రామ్ మంజి, పలువురు విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement