పువ్వు విచ్చుకుంటే...గ్రహం కనిపిస్తుంది! | Sakshi
Sakshi News home page

పువ్వు విచ్చుకుంటే...గ్రహం కనిపిస్తుంది!

Published Tue, Apr 1 2014 12:09 AM

పువ్వు విచ్చుకుంటే...గ్రహం కనిపిస్తుంది!

విచ్చుకున్న పువ్వులాంటి ఈ డిజైన్ ఏమిటో... పక్కనే స్పేస్ శాటిలైట్ ఉండటమేమిటో? ఇవేనా మీ సందేహాలు. కానీ అది శాటిలైట్ కాదు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) త్వరలో ప్రయోగించబోతున్న అంతరిక్ష టెలిస్కోపు. సువిశాల విశ్వంలో భూమి లాంటి గ్రహాల్ని వెతకడం దీని లక్ష్యం. మరి... ఆ పువ్వులాంటి నిర్మాణమేమిటి? అక్కడే వస్తున్నాం. ఈ అంతరిక్ష టెలిస్కోపు లక్ష్యసాధనలో దీనిదే కీలకపాత్ర. సూర్యుడి లాంటి నక్షత్రాల చుట్టూ గ్రహాలు తిరుగుతున్నా... వాటిని చాలా దూరం నుంచి చూడాలంటే సూర్యుడి వెలుగు అడ్డంకిగా మారుతుంది.
 
 అదే మీరు సూర్యుడి వెలుగును అడ్డుకునేందుకు ఇలాంటి ఓ నిర్మాణాన్ని అడ్డం పెట్టారనుకోండి. కొంచెంకొంచెం వెలుగులు మాత్రమే చిమ్మే గ్రహాలను కూడా ఎంచక్కా ఫొటోలు తీసుకోవచ్చు. అందుకే నాసా ‘స్టార్‌షేడ్’ పేరుతో వచ్చే ఏడాది ఇలాంటి నిర్మాణాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టనుందన్నమాట. బాగా మడతపెట్టేసిన స్టార్‌షేడ్‌ను టెలిస్కోపుతోపాటే అంతరిక్షంలోకి పంపిస్తారు. అక్కడ ఇది టెలిస్కోపు నుంచి విడిపోతుంది.. నెమ్మదిగా విచ్చుకుని ఇలా మారుతుంది. దీని సైజు ఎంతుంటుందో తెలుసా? దాదాపు కొన్ని వందల మీటర్ల వెడల్పు!
 

Advertisement

తప్పక చదవండి

Advertisement