తలవంచిన యాజమాన్యం | Sakshi
Sakshi News home page

తలవంచిన యాజమాన్యం

Published Fri, Dec 6 2013 4:47 AM

NDCL finally allowed to crushing

 బోధన్, న్యూస్‌లైన్ : చెరుకు రైతుల ఆందోళనకు నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ యాజమాన్యం తలవంచింది. ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ శనివారం నుంచి ప్రారంభిస్తామని ప్రకటించింది. బుధవారం జరిగిన చర్చల అనంతరం పది రోజుల పాటు క్రషింగ్ నిలిపిస్తున్నట్లు ఫ్యాక్టరీ అధికారులు పేర్కొనడంతో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. గురువా రం బోధన్ బంద్ నిర్వహించారు. ఫ్యాక్టరీ ప్రవే శ ద్వారం వద్ద ధర్నాకు దిగారు. అంతకు ముం దు పట్టణంలో భారీ ర్యాలీ తీశారు. ప్రధాన వీ దుల గుండా సాగిన ర్యాలీ మధ్యాహ్నం 12 గం టలకు ధర్నా శిబిరానికి చేరుకుంది. ఈ శిబి రం లో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కేపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఫ్యాక్టరీ చైర్మన్ గోకరాజు గంగరాజు తీరుతో చెరుకు రైతులు ఇబ్బందుల పాలవుతున్నారని ఆరోపించారు. ఫ్యాక్టరీలో ప్రభుత్వ భాగస్వామ్యాన్ని తొల గించుకోవాలనే దురుద్దేశంలో గోకరాజు ఉన్న ట్లు సంఘం ప్రధాన కార్యదర్శి గోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
 
 ఉత్కంఠకు తెర
 నిజాం దక్కన్ షుగర్స్‌లో క్రషింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళ న ఉద్రిక్తతకు దారి తీసింది. ఓ రైతు ఫ్యాక్టరీలోపల ఉన్న ఎత్తై పవర్ ప్లాంట్ ట్యాంక్ ఎక్కి క్రషింగ్ ప్రారంభించకపోతే పైనుంచి కిందకి దూకుతానని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న రైతులు ట్యాంక్ వద్దకు పరుగులు పెట్టారు. రైతును ఖాజాపూర్‌కు చెందిన చింతం సాయిలుగా గుర్తించారు. కిందకు దూకవద్దని కోరారు. డీఎస్‌పీ గౌస్ మోహినొద్దీన్, సీఐ శం కరయ్య, తహశీల్దార్ రాజేశ్వర్ అక్కడికి చేరుకుని ‘‘క్రషింగ్ ప్రారంభమవుతోంది..నీ చెరుకు ఫ్యాక్టరీకి తరలించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుం టాం కిందికి దిగిరావాలని’’ మైకు ద్వారా సాయిలును  కోరారు. చెరకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కేపీ శ్రీనివాస్‌రెడ్డి, ప్రతినిధులు కొప్పర్తి సుబ్బారావు, కార్యదర్శి గోపాల్ రెడ్డితో చర్చించారు. అయినా రైతులు రాత్రి ఏడు గంటల వరకు రైతులు ఫ్యాక్టరీలోనే బైఠాయించారు.
 
 నిజామాబాద్ అర్బన్ ఎమ్మె ల్యే యెండల లక్ష్మీనారాయణ, ఏఎంసీ చైర్మన్ గం గాశంకర్, సీడీసీ చైర్మన్ పోతా రెడ్డి, టీడీపీ నేతలు ప్రకాష్ రెడ్డి, అమర్‌నాథ్‌బాబు, బీజేపీ నాయకుడు కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి, మండల నా యకులు రైతులతో మాట్లాడారు. నిజామాబా ద్ ఆర్‌డీఓ యాదిరెడ్డి సమక్షంలో చర్చలు సా గాయి. శనివారం క్రషింగ్ ప్రారంభించేందుకు ఫ్యాక్టరీ అధికారులు అంగీకరిం చడంతో రైతు లు ఆందోళన విరమించారు. సాయిలు కిందకు దిగి వచ్చాడు. రైతు ప్రతి నిధులు పావులూరి వెంకటేశ్వర్‌రావు, మాజీ ఎంపీపీ గిర్దావర్ గం గారెడ్డి, కాశీనాథ్‌రెడ్డి, శివరాజ్ పాటిల్, మార్కె ట్ కమిటీ మాజీ చైర్మన్ పాషా మోహియుద్దీన్, జేఏసీ మండల కన్వీనర్ పి. గోపాల్‌రెడ్డి, కార్యదర్శి మల్లేశ్, సీడీసీ చైర్మన్ పోతారెడ్డి, మారుతీ రావు పటేల్, బీర్కూర్ సురేందర్, హన్మంత్‌రా వు, పోలా మల్కారెడ్డి పాల్గొన్నారు. పీడీఎస్ యూ కార్యకర్తలు చెరుకు రైతుల ఆందోళనకు మద్దతు పలికారు.
 

Advertisement
Advertisement