ఆటోగ్రాఫ్ ఔట్.. సెల్ఫీ ఇన్! | Sakshi
Sakshi News home page

ఆటోగ్రాఫ్ ఔట్.. సెల్ఫీ ఇన్!

Published Wed, Jul 1 2015 6:41 PM

ఆటోగ్రాఫ్ ఔట్.. సెల్ఫీ ఇన్!

లక్నో:  'సెల్ఫీ' ఈ పదం ఇప్పుడు యువత ఫాలో అవుతున్న సరికొత్త ట్రెండ్. చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే చాలు ఎప్పుడైనా ఎక్కడైనా చక్కగా సెల్ఫీలు తీసేసుకోవచ్చు. ఎవరైనా సెలబ్రిటీలు వస్తే చాలు.. ఒకప్పుడు ఆటోగ్రాఫ్ పుస్తకాలు పట్టుకుని యువత హడావుడి చేసేవారు. ఇప్పుడు చేతిలో ఫోన్ పట్టకుని.. సెల్ఫీ ప్లీజ్ అని అడుగుతున్నారు. కెమెరా మోసుకుని వెళ్లాల్సిన అవసరం లేకుండా, అత్యాధునిక ఫీచర్లు, మంచి కెమెరాలతో స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రావడంతో ఎక్కడిపడితే అక్కడ సెల్ఫీలకు పోజులిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బుధవారం తన పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్న సందర్భంగా సెల్ఫీలపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. నేటి యువత ఆటోగ్రాఫ్ల కంటే సెల్ఫీలనే ఎక్కువగా కోరుకుంటున్నారని చెప్పారు. అంతేకాక తన చిన్ననాటి తరానికి ఇప్పటి తరానికి మధ్య చాలా మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా అభినందించడానికి వచ్చినవాళ్లలో కూడా ఆటోగ్రాఫ్ అడిగిన వాళ్ల కంటే సెల్ఫీలు అడిగినవాళ్లే ఎక్కువగా ఉన్నారన్నారు.

Advertisement
Advertisement