ఎన్నారై హత్య కేసులో న్యూజిలాండ్ మహిళకు శిక్ష! | Sakshi
Sakshi News home page

ఎన్నారై హత్య కేసులో న్యూజిలాండ్ మహిళకు శిక్ష!

Published Thu, Sep 19 2013 5:37 PM

New Zealand woman acquitted of murdering Indian-origin man

భారత సంతతికి చెందిన వ్యక్తి హత్యకేసులో న్యూజిలాండ్ దేశానికి చెందిన మహిళ జెస్సికా లీ కీఫే దోషి అని గురువారం కోర్టు తీర్పు వెల్లడించింది. తన భాగస్వామి సీన్ వర్మను హత్య చేసినట్టు వెల్లింగ్టన్ హైకోర్టుకు చెందిన 12 మంది సభ్యుల బృందం తీర్పును వెల్లడించింది. కత్తితో గాయపరచడం కారణంగానే వర్మ మరణించారని తీర్పులో వెల్లడించారు. భారత సంతతికి చెందిన వర్మకు న్యూజిలాండ్ లోని ప్రధాన క్రిమినల్ నెట్ వర్క్ కు మాంగెల్ మోబ్ అనే వ్యక్తితో సంబంధాలున్నాయని తెలిసింది. మోబ్ చిన్న కూతురే కీఫే అని విచారణలో వెల్లడైంది. 
 
వర్మ చాతిలో కత్తి ఎలా గుచ్చుకుందో తనకు తెలియదు.. గుర్తు కూడా లేదు అని కీఫే తెలిపింది. తన ముఖంపై వర్మ బాదడంతో తనకు ఏమి జరిగిందో కూడా తెలియలేదని.. ఈ కేసులో తనను శిక్షించవద్దని కోర్టును వేడుకుంది. అయితే వర్మ హత్య కేసుతో సంబంధంలేదని కీఫే కోర్టుకు సాక్ష్యాలను సమర్పించడంలో విఫలమవ్వడం కోర్టు శిక్షను ఖారారు చేసింది.  కీఫేపై దాడి చేసే సమయంలో వర్మ తనంతటా తాను కత్తితో పొడుచుకున్నాడని ఆమె తరపు డిఫెన్స్ న్యాయవాది వాదించాడు. 
 
వర్మ తల్లితండ్రులు నివసించే కొద్ది దూరంలోనే కీఫే, తన పిల్లలతో కలిసి ఉంటుందని.. గతంలో కీఫేను శారీరక వేధింపులకు గురి చేశారనే ఆరోపణపై వర్మను కోర్టు దోషిగా పేర్కొంది. ఆ తర్వాత గృహ హింస కేసులో వర్మకు కౌన్సిలింగ్ కూ ఇచ్చినట్టు సమాచారం. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement