పాక్ ఉగ్రవాదికి లై డిటెక్టర్ పరీక్షలు | Sakshi
Sakshi News home page

పాక్ ఉగ్రవాదికి లై డిటెక్టర్ పరీక్షలు

Published Mon, Aug 17 2015 3:24 PM

పాక్ ఉగ్రవాదికి లై డిటెక్టర్ పరీక్షలు - Sakshi

శ్రీనగర్: బీఎస్ఎఫ్ జవాన్లపై దాడికి పాల్పడిన పాకిస్థాన్కు చెందిన లష్కర్ ఏ తాయిబా ఉగ్రవాది నవేద్ యాకూబ్కు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అనుమతి పొందింది. మంగళవారం ఎన్ఐఏ అధికారులు నవేద్కు పరీక్షలు నిర్వహించనున్నారు. సోమవారం ఎన్ఐఏ కోర్టు ఈ మేరకు అనుమతి మంజూరు చేసింది. నవేద్ ప్రస్తుతం 14 రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉన్నాడు.

ఉదంపూర్లో బీఎస్ఎఫ్ కాన్వాయ్పై దాడి చేసిన నవేద్ సజీవంగా పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు మరణించగా, మరో పాక్ ఉగ్రవాదిని భద్రత దళాలు హతమార్చాయి. సమీప గ్రామంలోకి పారిపోయిన నవేద్ను గ్రామస్తులు బంధించి భద్రత దళాలకు అప్పగించారు. కసబ్ తర్వాత సజీవంగా దొరికిన పాక్ ఉగ్రవాది నవేదే.

Advertisement
Advertisement