లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు | Sakshi
Sakshi News home page

లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు

Published Wed, Jan 25 2017 9:40 AM

Nifty Regains 8,500 On Strong Global Cues, Bharti Airtel Falls On Q3

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో వరుసగా మూడో రోజుకూడా లాభాలతోనే మొదలయ్యాయి.  సెన్సెక్స్ 100పాయిట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది.  ముఖ్యంగా గత నవంబర్ తరువాత, నిఫ్టీ  మొదటిసారి 8500 స్థాయికి పైన  స్థిరంగా ట్రేడ్ అవుతోంది. దేశీయంగా బలపడ్డ సెంటిమెంటుతో  మదుపర్లు సాను కూలంగా స్పందిస్తున్నారు. దీంతో దాదాపు అన్ని రంగాలూ పాజిటివ్ గా   ఉన్నాయి. ప్రధానంగా బ్యాంక్‌ నిఫ్టీ, రియల్టీ, మెటల్‌ రంగాలు లాభాల్లో కొనసాగుతున్నాయి.    యస్‌బ్యాంక్‌, జీ, అదానీ పోర్ట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ లాభాల్లో ఉండగా, నిన్నటి  ఫలితాల దెబ్బతో భారతీ ఎయిర్ టెల్  టాప్ లూజర్ గా ఉంది.  ఐడియా కూడా ఇదే బాటలో ఉంది.  అల్ట్రాటెక్, టాటాపవర్‌, అరబిందో బలహీనపడ్డాయి.
అటు దేశీయ కరెన్సీ  రూపాయి నిన్నటి ముంగింపుతో పోలిస్తే  నష్టాలతో  ప్రారంభమైంది.  5పైసలు క్షీణించి రూ. 68.17 వద్ద ఉంది.  ప్రపంచకరెన్సీలతో పోలీస్తే డాలర్ ఈ రోజుపుంజుకోవడం రూపాయి నెగటివ్ గా ఉంది.   
 

Advertisement
Advertisement