ఆ విమానాన్ని కూల్చేయలేదు! | Sakshi
Sakshi News home page

ఆ విమానాన్ని కూల్చేయలేదు!

Published Sat, Oct 31 2015 3:37 PM

ఆ విమానాన్ని కూల్చేయలేదు! - Sakshi

కైరో: రష్యా విమాన ప్రమాద ఘటనలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల హస్తముందని వస్తున్న వార్తలను ఈజిప్టు భద్రతా వర్గాలు ధ్రువీకరించడం లేదు. ఈ విమానాన్ని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కూల్చివేశారని చెప్పడానికి ఎలాంటి సంకేతాలు లేవని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. 

రష్యా విమానం కూలిన సినాయ్ ప్రాంతంలో ఐఎస్ఐఎస్ గ్రూపు బలంగా ఉంది. రెండేళ్ల కిందట ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న ఆ ఉగ్రవాద సంస్థ ఇక్కడున్న ఈజిప్టు సైనికులు, పోలీసులు వందలమందిని చంపేసింది. ఈ నేపథ్యంలో సినాయ్ ద్వీపకల్పం మీదుగా వెళుతున్న విమానాన్ని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే కూల్చివేశారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement