జియో యూజర్లకు వార్నింగ్.. ఆ మెసేజ్తో జాగ్రత్త! | Sakshi
Sakshi News home page

జియో యూజర్లకు వార్నింగ్.. ఆ మెసేజ్తో జాగ్రత్త!

Published Tue, Jan 24 2017 3:38 PM

జియో యూజర్లకు వార్నింగ్.. ఆ మెసేజ్తో జాగ్రత్త! - Sakshi

న్యూఢిల్లీ : ఉచిత ఆఫర్లతో వినియోగదారులను మురిపిస్తున్న రిలయన్స్ జియో రోజువారీ డౌన్లోడ్ పరిమితిని పెంచుతుందంటూ... మెసేజ్లు వస్తున్నాయా? అయితే వాటిని నమ్మి మోసపోకండి. జియో డౌన్లోడ్ పరిమితినేమి పెంచడం లేదట. సైబర్ క్రిమినల్స్ పన్నిన పన్నాగమే ఈ తప్పుడు మెసేజ్లు అని రిపోర్టులు పేర్కొంటున్నాయి. రిలయన్స్ జియో పేరుతో ఫేస్బుక్లో ఫేక్ మెసేజ్లు పంపుతూ  యూజర్ల వ్యక్తిగత డేటాను సైబర్ క్రిమినల్స్ కొట్టేస్తున్నారట. అంతేకాదు ఆ మెసేజ్లను మరో 10 స్నేహితులకు ఫార్వర్డ్ చేయడంటూ వారిని కూడా రిస్క్లో పడేస్తున్నారట. రిలయన్స్ జియో యూజర్లు ఈ లింక్ను క్లిక్ చేస్తే, రోజువారి డేటా పరిమితి 1జీబీ నుంచి 10 జీబీకి అప్గ్రేడ్ అవుతుందనే మెసేజ్ ఇటీవల ఫేస్బుక్లో తెగ చక్కర్లు కొడుతోంది. 
 
ఈ లింక్ను క్లిక్ చేస్తే, యూజర్ల మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ అడ్రస్తో పాటు పలు వివరాలను అడుగుతోంది. అన్ని వివరాలను యూజర్లు షేర్ చేసిన అనంతరం ఆ మెసేజ్ను మరో 10 మంది వాట్సాప్ గ్రూప్లకు పంపండంటూ అది అడుగుతోంది. జియో సర్వీసు అప్గ్రేడ్ అవ్వాలంటే  ఆ లింక్ను 10 మంది వాట్సాప్ గ్రూప్స్కు లేదా స్నేహితులకు పంపించాల్సిందేనట. నిజంగా జియో సర్వీసు అప్గ్రేడ్ అవుతుందని నమ్మి ఈ పని చేశారో, యూజర్లు మోసపోయినట్టేనట. యూజర్ల వ్యక్తిగత డేటా సైబర్ క్రిమినల్స్ చేతిలోకి వెళ్లిపోతుందట. ఆ పేజీలోనే మరో వివరం కూడా ఉంది. గో4జీ అసలు రిలయన్స్ లేదా జియోకు సంబంధించి కాదని నిబంధనలు, షరతుల్లో తెలుపుతున్నారు.
 
దాన్ని చూసుకోకుండా ఈ లింక్ను క్లిక్ చేస్తే, కేవలం తమ వ్యక్తిగత డేటానే కాకుండా స్నేహితులను రిస్కులో పడేసినట్టేనని రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. కంపెనీ ఇటీవలే ఉచిత ఆఫర్ల సర్వీసులను పొడిగిస్తూ హ్యాపీ న్యూఇయర్ ఆఫర్లో రోజువారి కేవలం 1జీబీ డేటానే రిలయన్స్ జియో ఆఫర్ చేస్తుంది. ఈ పరిమితిని పెంచుతూ కంపెనీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ ఈ ఫేక్ మెసేజ్లు జియో పేరుతో వచ్చి యూజర్లను మోసం చేస్తున్నాయి. 

Advertisement
Advertisement