‘క్విప్’తో రెండేళ్లదాకా నిధుల కొరత ఉండదు: ఎస్‌బీఐ | Sakshi
Sakshi News home page

‘క్విప్’తో రెండేళ్లదాకా నిధుల కొరత ఉండదు: ఎస్‌బీఐ

Published Sat, Jan 4 2014 1:40 AM

No new capital needed for two years post Rs 11.5K cr QIP: SBI

ముంబై: త్వరలో చేపట్టనున్న క్విప్ ఇష్యూ తరువాత రెండేళ్ల వరకూ కొత్త పెట్టుబడుల అవసరం ఉండబోదని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల విక్రయం(క్విప్) ద్వారా రూ. 11,500 కోట్లను సమీకరించేందుకు బ్యాంకు ఇప్పటికే అనుమతులు పొందింది. క్విప్ తరువాత మాత్రమే నిధుల సమీకరణకు విదేశీ బాండ్ల జారీ వంటివి చేపట్టే అవకాశమున్నదని అరుంధతి తెలిపారు. క్విప్ తరువాత బ్యాంకులో ప్రభుత్వ వాటా 58%కు పరిమితం కానుంది. కాగా, ప్రభుత్వం రూ.2,000 కోట్ల పెట్టుబడుల ను అందించేందుకు గతంలోనే సంసిద్ధత వ్యక్తం చేసింది. మార్చికల్లా క్విప్ ఇష్యూ పూర్తికానుంది.

Advertisement
Advertisement