నాన్‌ సబ్సిడీ సిలిండర్‌ ధర పెంపు.. | Sakshi
Sakshi News home page

నాన్‌ సబ్సిడీ సిలిండర్‌ ధర పెంపు..

Published Wed, Mar 1 2017 3:23 PM

నాన్‌ సబ్సిడీ సిలిండర్‌ ధర పెంపు..

ఢిల్లీ: నాన్ సబ్సిడీ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి.  నాన్ సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ పై రూ.86 లను  పెంచుతున్నట్టు బుధవారం ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌  ప్రకటించింది.  అంతర్జాతీయ మార్కెట్‌ లో ఎల్‌పీజీ ధరలు  భారీగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ ధరలు వెంటనే అమల్లోకి  రానున్నాయని తెలిపింది.

అయితే సబ్సిడీ సిలిండర్ల ధరలపై ఎలాంటి ప్రభావం ఉండదని కేంద్ర ప్రభుత‍్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. మార్చి 1, 2017 నాటికి సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర  రూ. 737 గా ఉంటుందని, సబ్సిడీ రూ. 303 ఆయా ఖాతాల్లో జమ అవుతుందని వివరించింది. యథావిధిగా 14.2 కేజీల వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.434 ఉంటుందిని స్పష్టం చేసింది.

మరోవైపు ఈ పెంపుప్రకటనతో ఐఓసీ కంపెనీ షేర్లు దాదాపు 1.2 శాతం పడిపోయింది

 

Advertisement
Advertisement