ఆన్ లైన్ షాపింగ్ తో హ్యాపీగా లేరా? అయితే.... | Sakshi
Sakshi News home page

ఆన్ లైన్ షాపింగ్ తో హ్యాపీగా లేరా? అయితే....

Published Mon, Mar 13 2017 1:51 PM

ఆన్ లైన్ షాపింగ్ తో హ్యాపీగా లేరా? అయితే....

ముంబై : ఏ షాపుకి వెళ్లాల్సినవసరం లేకుండానే, ఇంట్లోంచే వస్తువులను కొనుకునే విధంగా  ఆన్ లైన్ షాపింగ్ వచ్చి మన నట్టింట్లో వాలింది.  ఒక్క సర్వీసులే కాదు, బంపర్ డిస్కౌంట్లను కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. కానీ  ఇటీవల ఆన్ లైన్ షాపింగ్ లో భారీ ఎత్తున్న మోసాలు పెరిగిపోతున్నాయి. ఫోన్ కొంటే రాళ్లు రావడం ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటిపై కన్జ్యూమర్ కోర్టుకెళ్లినా.. నష్టపరిహారం చేతికొచ్చేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతోంది. ఈ నేపథ్యంలోనే తొలిసారి ఆన్ లైన్ కన్జ్యూమర్ మీడియేషన్ సెంటర్(ఓసీఎంసీ) ఏర్పాటైంది.  నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ వద్ద కన్జ్యూమర్ లా అండ్ ప్రాక్టిస్ దీన్ని ఏర్పాటుచేసింది. పైలెట్ ఫేస్ కింద ఈ సెంటర్ ఈ-కామర్స్ సెక్టార్లోని సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తోంది.
 
ఈ-కామర్స్ సెంటర్లో తలెత్తే ప్రతి ఫిర్యాదును ఇది పర్యవేక్షిస్తోంది. కన్జ్యూమర్ కోర్టులలో కేసుల గుట్టను తగ్గించి, వినియోగదారుల, వ్యాపారాల మధ్య సంబంధాలను మెరుగుపర్చేందుకు ఈ సెంటర్ కు అంకురార్పణ జరిగినట్టు తెలిసింది. ఈ రూ.1కోట్ల ప్రాజెక్టుకు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఫండ్స్ కల్పిస్తోంది. దీనికి కన్జ్యూమర్ లా అండ్ ప్రాక్టిస్ చైర్ ప్రొఫెసర్ అశోక్ ఆర్ పాటిల్ అధినేతగా వ్యవహరిస్తున్నారు. 2016 డిసెంబర్ లో దీన్ని ప్రారంభించారు. 
 
రిపోర్టు ప్రకారం 74.9 శాతం వినియోగదారులకు అసలు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, 1986 ఉన్నట్టే తెలియదని, 78 శాతం రెస్పాడెంట్లు సమస్యల పరిష్కారం చాలా కష్టంగా ఉందని భావిస్తున్నట్టు వెల్లడైందని పాటిల్ తెలిపారు. అడ్వకేట్లు, పార్టీల కోరిక మేరకు వినియోగదారుల వివాద పరిష్కార ఫోరమ్ లు తీర్పులను వాయిదా వేస్తూ ఉంటాయని పాటిల్ చెప్పారు. వినియోగదారుల వివాదాలను త్వరగా పరిష్కరించడానికి ఈ-కామర్స్ సంస్థలకు వ్యతిరేకంగా రెండేళ్ల పైలెట్ ప్రొగ్రామ్ ను ప్రారంభించినట్టు ఆయన పేర్కొన్నారు.  ఇది ఏ సమయంలోనైనా, ఎక్కడి సమస్యనైనా వెనువెంటనే పరిష్కరిస్తుందని తెలిపారు.
 
తమ ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ త్వరగా సెటిల్ మెంట్ కుదర్చడంతో పాటు ఇరు పక్షాలకు అనుకూలంగా వ్యవహరించేలా చూస్తుందని పాటిల్ చెప్పారు. వినియోగదారుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు సెటిల్ మెంట్ కుదర్చడం కొంత కష్టంతో కూడుకుంటుందని, వారు ఈ-కామర్స్ కంపెనీల నుంచి నష్టపరిహారాలను ఆశిస్తుంటారని పేర్కొన్నారు. వాలంటరీగా కేసులను టేకప్ చేసి, వినియోగదారుల సమస్యలను పరిష్కరిస్తామని పాటిల్ చెప్పారు.. 

Advertisement
Advertisement