ప్రముఖ కన్నడ రచయిత శివరుద్రప్ప కన్నుమూత! | Sakshi
Sakshi News home page

ప్రముఖ కన్నడ రచయిత శివరుద్రప్ప కన్నుమూత!

Published Mon, Dec 23 2013 4:00 PM

Noted Kannada writer Shivarudrappa passes away

ప్రముఖ కన్నడ రచయిత, కవి, పరిశోధకుడు జీఎస్ శివరుద్రప్ప సోమవారం బెంగళూరులోని ఆయన నివాసంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. శివరుద్రప్పకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతోపాటు, కన్నడ సాహిత్య అవార్డు, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డులు ఆయనకు లభించాయి. 
 
సాహిత్య రంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తుగా కర్నాటక ప్రభుత్వం శివరుద్రప్పను 'రాష్ట్ర కవి' అనే బిరుదుతో సత్కరించింది. కన్నడ సాహిత్యానికి విశేష కృషిని అందించిన శివరుద్రప్ప మృతి తీరని లోటు అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. ఆయన మృతికి సంతాపంగా మంగళవారం ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవు దినాన్ని ప్రకటించారు. అంతేకాకంఉడా రెండు రోజులపాటు సంతాపం పాటించనుందని, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రభుత్వం ఓప్రకటనలో తెలిపింది. 

Advertisement
Advertisement