ఆయన అమెరికాను అడ్డంగా అమ్మేస్తాడు! | Sakshi
Sakshi News home page

ఆయన అమెరికాను అడ్డంగా అమ్మేస్తాడు!

Published Thu, Jul 28 2016 9:24 AM

ఆయన అమెరికాను అడ్డంగా అమ్మేస్తాడు! - Sakshi

ఫిలడెల్ఫియా: అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తన సొంత పార్టీ డెమొక్రటిక్‌ జాతీయ సదస్సులో పార్టీ శ్రేణులను ఉద్దేశించి భావోద్వేగంగా ప్రసంగించారు. 12 ఏళ్ల కిందట ఇదే వేదికపై అధ్యక్ష అభ్యర్థిగా ప్రసంగించిన ఒబామా.. ప్రస్తుతం రెండు పర్యాయలు పూర్తిచేస్తుకున్న శ్వేతసౌధం అధిపతిగా మాట్లాడుతూ డెమొక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అమెరికా అధ్యక్ష పదవికి తనకన్నా, బిల్‌ క్లింటన్‌ కన్నా హిల్లరీ ఎక్కువ అర్హురాలని, ఆమెను ఎంతమంది దెబ్బతీయాలని చూసినా, ఆమె ఎప్పుడు వెనుకడుగు వేయబోదని, వెన్నుచూపి తప్పుకోబోదని పేర్కొన్నారు. ఇంకా తన ప్రసంగంలో ఒబామా ఏమన్నారంటే..

  • నేను రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాను. అమెరికా భవిష్యత్తు పట్ల ఎప్పుడూ లేనంత ఆశాభావంతో ఉన్నాను.
  • ఎన్నో ప్రమాణాల ఆధారంగా చూసుకుంటే ఇప్పుడు మన దేశం ఎంతో శక్తిమంతంగా, సమృద్ధిగా ఉంది.
  • గతవారం క్లీవ్‌ల్యాండ్‌లో జరిగిన రిపబ్లికన్‌ సదస్సులోని వ్యాఖ్యలు మనం విన్నాం. ఇవి ఎంతమాత్రం కన్జర్వేటివ్ అభిప్రాయాలు కావు. దేశ భవిష్యత్తు గురించి ఎంతో నిరాశాపూరితమైన వ్యాఖ్యలు చేశారు. ఒకరిపైకి ఒకరిని ఉసిగొల్పి ప్రపంచం నుంచి అమెరికాను వేరే చేసేలా మాట్లాడారు. ఇది నిజమైన రిపబ్లికన్‌ పార్టీయేనా అనిపించింది.
  • అమెరికా ఇప్పటికే గొప్ప దేశం. శక్తిమంతమైన దేశం. మన గొప్పతనం కోసం ట్రంప్‌పై ఆధారపడాల్సిన ఖర్మ పట్టలేదు.
  • తన సంకుచిత భావజాలంతో డొనాల్డ్ ట్రంప్‌ అమెరికా ప్రజలను అమ్మేయగలడు. కానీ, మనం అంత బలహీనులం. భయస్తులం కాము.
  • ఈ నేలమీద డొనాల్డ్ ట్రంప్‌ 70 ఏళ్లు బతికాడు. కానీ ఎన్నడూ ఆయన కార్మికులను గౌరవించిన పాపాన పోలేదు.
  • ఎనిమిదేళ్ల కిందట అధ్యక్ష అభ్యర్థి నామినేషన్‌ కోసం నేను-హిల్లరీ ప్రత్యర్థులుగా పోరాడం. ఆ పోరు చాలా కఠినంగా కొనసాగింది. ఎందుకంటే హిల్లరీ అంత దృఢమైన వ్యక్తి.
  • ఐఎస్‌ఐఎస్‌ను తుదముట్టించేవరకు హిల్లరీ విశ్రమించబోదు. ఆమె తదుపరి కమాండర్ ఇన్‌ చీఫ్‌ పదవి చేపట్టేందుకు సైతం ఫిట్‌గా ఉంది. మన పిల్లల భవిష్యత్తును ఆమె కాపాడగలదు.
  • మన పిల్లలు, భావితరాలను కాపాడుకునేందుకు తుపాకీ సంస్కృతిని నియంత్రించాల్సిన అవసరముంది.

Advertisement
Advertisement