గాళ్ఫ్రెండ్స్ను ఎరగావేస్తే.. పైలట్ బుక్కయ్యాడు | Sakshi
Sakshi News home page

గాళ్ఫ్రెండ్స్ను ఎరగావేస్తే.. పైలట్ బుక్కయ్యాడు

Published Sat, Jul 9 2016 10:46 AM

గాళ్ఫ్రెండ్స్ను ఎరగావేస్తే.. పైలట్ బుక్కయ్యాడు - Sakshi

న్యూఢిల్లీ: ముగ్గురు మోసగాళ్లు తమ గాళ్ఫ్రెండ్స్ను ఎరగా వేసి ఓ ప్రముఖ విమానయాన సంస్థలో పనిచేస్తున్న పైలట్కు టోకరా వేశారు. పైలట్ను బ్లాక్మెయిల్ చేసి దాదాపు పది లక్షల రూపాయలను వసూలు చేశారు. చివరకు పైలట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు దొరికిపోయారు.

పైలట్కు అడల్ట్ ఫ్రెండ్షిప్ వెబ్సైట్లో ఇద్దరు మహిళలు పరిచయమయ్యారు. ఈ పరిచయానికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని పైలట్ ఊహించలేదు. రోహిణిలో ఓ కేఫ్లో ఇద్దరు మహిళలను కలిసిన పైలట్.. ఓ రాత్రి వారి ఫ్లాట్కు వెళ్లాడు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆ ఇంట్లోకి వచ్చి తమను క్రైం బ్రాంచ్ అధికారులుగా చెప్పుకున్నారు. మహిళలను రేప్ చేసినట్టు కేసు పెడతామని పైలట్ను బెదిరించారు. మహిళలను ఇద్దరిని వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో భయపడిన పైలట్ కేసు నుంచి తప్పించుకునేందుకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. తొలుత 20 వేల రూపాయల నగదు ఇచ్చిన పైలట్ ఆ తర్వాత మరో లక్ష ముట్టజెప్పాడు. ఆ ముగ్గురు వ్యక్తులు మరోసారి బ్లాక్ మెయిల్ చేయడంతో మరో 9 లక్షలు ఇచ్చాడు.

ఈ వ్యవహారం అంతటితో ముగిసిపోతుందని భావించిన పైలట్కు ఆ త్రయం మరిన్ని చికాకులు పెట్టింది. కొత్త డిమాండ్లు పెట్టి వేధించసాగారు. దీంతో విసిగిపోయిన పైలట్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కాల్స్ డేటా ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుల్లో ఇద్దరు హోంగార్డులు జగతిందర్ సింగ్ అలియాస్ జిమ్మి, సుందర్ లాల్, మరొకడు  జిమ్ ఇన్స్ట్రక్టర్ కమ్ బౌన్సర్ జితేందర్ అలియాస్ ప్రిన్స్గా పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్ తమ గాళ్ఫ్రెండ్స్ను ఎరగా వేసి దాదాపు 100 మందిని మోసగించినట్టు పోలీసుల విచారణలో తేలింది.

Advertisement
Advertisement