లాల్‌బహదూర్ అంటే చులకనా?

3 Oct, 2015 01:54 IST|Sakshi
లాల్‌బహదూర్ అంటే చులకనా?

{పధానిపై మండిపడ్డ విపక్షాలు
సమాధి వద్ద మోదీ నివాళి అర్పించకపోవటంపై ఆగ్రహం

 
 న్యూఢిల్లీ: మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రికి ఆయన జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులు అర్పించకపోవటంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మహాత్మాగాంధీ జయంతి రోజునే శాస్త్రి జయంతి కూడా కావటం తెలిసిందే. అయితే.. శుక్రవారం రాజ్‌ఘాట్‌కు వెళ్లి గాంధీకి నివాళులు అర్పించిన ప్రధాని మోదీ.. అక్కడికి అతి దగ్గర్లోనే ఉన్న విజయ్‌ఘాట్(లాల్‌బహదూర్ సమాధి)కు వెళ్లి నివాళులు అర్పించలేదు ట్విటర్‌లో మాత్రం శాస్త్రికి 140 పదాల్లో నివాళి అర్పించారు. మరోవైపు రాష్ట్రపతి ప్రణబ్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, వివిధ పార్టీల నేతలు విజయ్‌ఘాట్‌కు వెళ్లి శాస్త్రికి నివాళి అర్పించారు.

మరిన్ని వార్తలు