Sakshi News home page

ఇండో-పాక్ పెళ్లికి సుష్మాజీ గిప్ట్ ఏంటో తెలుసా?

Published Mon, Nov 7 2016 1:52 PM

ఇండో-పాక్ పెళ్లికి సుష్మాజీ గిప్ట్ ఏంటో తెలుసా? - Sakshi

జోథ్పూర్ : సవాలక్ష అడ్డంకుల అనంతరం పాకిస్తాన్ అమ్మాయి.. ఇండియా అబ్బాయి పెళ్లి నేడు జరుగుతోంది. భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సహకారంతో జోథ్పూర్(రాజస్తాన్)కు చెందిన నరేశ్ తేవానీ, కరాచీకి చెందిన ప్రియా బచ్చానీలు ఒకటి కాబోతున్నారు. రెండేళ్ల కిందట మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా కుదిరిన వీరి పెళ్లికి ఇటీవల భారత్-పాకిస్తాన్ల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు అడ్డుగా నిలిచాయి. పెళ్లి బృందానికి వీసా నిరాకరించారు. దిక్కుతోచని పరిస్థితిలో పెళ్లికొడుకు దేశప్రధానికి, విదేశీ వ్యవహారాల మంత్రికి తమ గోడు విన్నవించుకున్నాడు. వారి పెళ్లికి వీసా మంజూరు చేపించే బాధ్యత తానదేనంటూ సుష్మాస్వరాజ్ హామీఇచ్చారు. సుష్మా జోక్యంతో భారత రాయబారి కార్యాలయం పెళ్లికూతురికి, తన కుటుంబానికి వీసా మంజూరు చేసింది. దీంతో పెళ్లి కూతురు కుటుంబసభ్యులు 35 మంది ఆదివారం జోథ్పూర్ చేరుకున్నారు.
 
నిర్ణయించిన ప్రకారం నేడు వారి పెళ్లి జోథ్పూర్లో జరుగుతోంది. తమ అభ్యర్థనకు వెంటనే స్పందించి, పెళ్లికూతురికి వారి కుటుంబానికి వెంటనే వీసా మంజూరు చేసినందుకు నరేశ్, సుష్మాస్వరాజ్కు కృతజ్ఞతలు చెప్పాడు. "నేను చాలా సంతోషంగా ఉన్నా. అన్నీ అనుకున్నమాదిరిగానే జరిగాయి. వేడుకలను చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం" అని ప్రియా చెప్పింది. పెళ్లి నిశ్చయం అయ్యాక, అమ్మాయి తరుఫు వాళ్లు వీసాకు దరఖాస్తు చేసుకున్నారని, పెళ్లి ఏర్పాట్లన్నీ షెడ్యూల్ ప్రకారం జరుగుతూ వస్తున్నాయని కానీ అంతలోనే వారికి వీసా మంజూరులో ఆటంకం ఏర్పడిందని అబ్బాయి తండ్రి కన్హెయా లాల్ తేవానీ చెప్పారు. ఇలాంటి సమస్యలకు సుష్మాజీ దయాగుణం తెలిసి, వెంటనే ఆమెకు అభ్యర్థన పెట్టుకున్నామని తెలిపాడు. తమ అభ్యర్థనకు కూడా వెంటనే స్పందించిన సుష్మా , వెంటనే వీసా మంజూరు చేపించారని వివరించాడు.   

Advertisement

What’s your opinion

Advertisement