చైనాకు షాక్‌ ఇచ్చిన పాకిస్థాన్‌! | Sakshi
Sakshi News home page

చైనాకు షాక్‌ ఇచ్చిన పాకిస్థాన్‌!

Published Thu, Jun 22 2017 2:32 PM

చైనాకు షాక్‌ ఇచ్చిన పాకిస్థాన్‌!

వీసా నిబంధనలు మరింత కఠినతరం
 
న్యూఢిల్లీ: అన్ని కాలాల్లోనూ తన మిత్రపక్షమని ఘనంగా చెప్పుకొనే చైనాకు పాకిస్థాన్‌ షాక్‌ ఇచ్చింది. చైనా జాతీయుల వీసా నిబంధనలు కఠినతరం చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. పాకిస్థాన్‌లో పర్యటించాలనుకునే చైనా జాతీయుల కోసం కొత్త వీసా నిబంధనలను ఆ దేశ హోంశాఖ బుధవారం జారీ చేసింది. కల్లోలిత బెలూచిస్థాన్‌లో ఇద్దరు చైనీయులు అపహరణకు గురై హత్యకావడం ఇరుదేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు చైనీయులు బిజినెస్‌ వీసాలను దుర్వినియోగం చేసి తమ దేశంలో క్రైస్తవాన్ని ప్రచారం చేశారని పాక్‌ చెప్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లో ఉద్యోగం, వ్యాపారం కోసం వచ్చే చైనీయులకు సంబంధించిన వీసా నిబంధనలను ఆ దేశం కఠినతరం చేసింది. 
 
ఈ నిబంధనల ప్రకారం పాక్‌ బిజినెస్‌ వీసాలు కావాలంటే..  చైనాలోని పాకిస్థాన్‌ ఎంబసీ గుర్తించిన సంస్థ నుంచి ఆహ్వానం పొందాల్సి ఉంటుంది. పాక్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అనుమతితోపాటు పలువురు చైనా అధికారులు అనుమతి ఉంటేనే ఆ దేశవాసులకు బిజినెస్‌ వీసాలు ఇస్తామని పాక్‌ స్పష్టం చేసింది.

Advertisement
Advertisement