భారత డీటీహెచ్ ప్రసారాలు నిలిపేస్తాం: పాక్ | Sakshi
Sakshi News home page

భారత డీటీహెచ్ ప్రసారాలు నిలిపేస్తాం: పాక్

Published Thu, Sep 1 2016 2:42 PM

భారత డీటీహెచ్ ప్రసారాలు నిలిపేస్తాం: పాక్

ఇస్లామాబాద్: విదేశీ చానెళ్ల ప్రసారాలపై పాకిస్తాన్ ప్రభుత్వం త్వరలో ఆంక్షలు అమల్లోకి తేనుంది. ఈ మేరకు పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరి అథారిటీ(పీఈఎమ్ఆర్ఏ) ఓ ప్రకటన విడుదల చేసింది. మరికొద్ది నెలల్లో పాకిస్తానీ డీటీహెచ్ సర్వీసులు ప్రారంభం కానుండటంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. కేబుల్ ఆపరేటర్లు, శాటిలైట్ చానెళ్లకు తగిన సమయం ఇస్తున్నామని.. ఈ లోగా విదేశీ చానెళ్ల ప్రసారాలను నిలిపివేయాలని పేర్కొంది.

ప్రసారాలను నిలిపివేయని వారిపై అక్టోబర్ 15 తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే, భారత్ కు చెందిన డీటీహెచ్ ప్రసారాలపై ఇప్పటినుంచే నిషేధం విధిస్తున్నట్లు పీఈఎమ్ఆర్ఏ చైర్మన్ అబ్సర్ అలం చెప్పారు.  భారత చానెళ్ల ప్రసారానికి పాకిస్తాన్ లో ఎలాంటి అనుమతులు లేవని పేర్కొన్నారు. ఈ విషయంపై ఎఫ్ఐఏ, ఎఫ్ బీఆర్, స్టేట్ బ్యాంకు ఏజెన్సీలకు లేఖ రాసినట్లు పీఈఎమ్ఆర్ఏ వివరించారు. 24 గంటల సమయంలో 2 గంటల 40నిమిషాలు మాత్రమే విదేశీ ప్రసారాలను ప్రసారం చేస్తారని తెలిపారు.

Advertisement
Advertisement