ఈ ఫొటోను తీసినోడి పరిస్థితేంటి? | Sakshi
Sakshi News home page

ఈ ఫొటోను తీసినోడి పరిస్థితేంటి?

Published Thu, Apr 23 2015 8:25 AM

ఈ ఫొటోను తీసినోడి పరిస్థితేంటి? - Sakshi

ఫొటో చూడగానే గుండె జారిపోలే.. మరి ఈ ఫొటోను తీసినోడి పరిస్థితేంటి? అతడికైతే పై ప్రాణాలు పైనే పోయాయట. పాకిస్తానీ ఫొటోగ్రాఫర్ అతీఫ్ సయీద్. ఈ చిత్రాన్ని లాహోర్ సఫారీ పార్కులో తీశాడు. ఓ రోజు సఫారీ పార్కులో ఫొటోలు తీయడానికి బయల్దేరిన అతీఫ్‌కు ఈ మృగరాజు కనిపించిందట. మహా అందంగా ఉందే అంటూ.. కెమెరా తీసుకుని కారు దిగాడు. చాలా దగ్గరగా తీస్తే.. బాగుంటుందని చెప్పి.. గడ్డిలో నక్కుతూ.. దీని దగ్గరకు పోయాడట.

 

అంతవరకూ బాగానే ఉంది కానీ.. ఫొటో తీసేటప్పుడు వచ్చే ‘క్లిక్’ సౌండ్ ఈ మృగరాజు చెవిన పడింది. అంతే.. ఉగ్ర నరసింహుడి రూపమెత్తింది. అతీఫ్ పైకి దూసుకొచ్చింది. ఒక క్షణం లేటైతే.. అతీఫ్ దానికి ఆహారమైపోయేవాడే.. అతడి టైమ్ బాగుంది. అందుకే ఒలింపిక్ పతకం కోసం పరిగెట్టినట్లు పరిగెత్తి.. కారులో దూరి ప్రాణాలు దక్కించుకున్నాడు. అయితే.. పరిగెత్తే ముందు తన కెరీర్‌లోనే ది బెస్ట్‌గా నిలిచిపోయే ఈ ఫొటోను కూడా క్లిక్‌మనిపించాడు.

Advertisement
Advertisement