పీస్‌ పార్టీ చీఫ్‌ అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

పీస్‌ పార్టీ చీఫ్‌ అరెస్ట్‌

Published Wed, May 24 2017 11:45 AM

పీస్‌ పార్టీ చీఫ్‌ అరెస్ట్‌ - Sakshi

లక్నో: అత్యాచారం కేసులో మాజీ ఎమ్మెల్యే, పీస్‌ పార్టీ అధ్యక్షుడు మహ్మద్‌ ఆయూబ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. లక్నోలోని అలీగంజ్‌ థానె ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నర్సింగ్‌ కోర్సు చేస్తున్న 22ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

కాలేయం, మూత్రపిండాలు పాడైపోవడంతో బాధితురాలు ఫిబ్రవరి 24న మరణించింది. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు ఆయూబ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. లైంగికంగా వేధించడమే కాకుండా తప్పుడు వైద్యంతో తన సోదరి మృతికి ఆయూబ్‌ కారణమయ్యారని బాధితురాలి సోదరుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిబ్రవరి 25న మాదియన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు. ఆయూబ్‌పై 372(2) ఎఫ్‌, 506 ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ముస్లింల్లో మంచి పట్టున్న పీస్‌ పార్టీ 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలుచుకుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement