భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Published Wed, Aug 31 2016 8:27 PM

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు - Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల వరుసగా తగ్గుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఈ సారి పెరిగాయి. రెండు నెలలుగా ప్రతి 15 రోజులకోసారి స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధర బుధవారం లీటర్పై 3.38 రూపాయలు పెరిగింది.  ఇక డీజిల్ ధర లీటర్కు 2.67 రూపాయలు పెరిగింది.

కొత్తధరలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 63.47 రూపాయలకు పెరగనుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రో ఉత్పత్తుల ధరలు, డాలర్-రూపాయి మారకం విలువ బట్టి ధరలు పెరిగాయి.


 

Advertisement

తప్పక చదవండి

Advertisement