నీడలా వెంటాడుతున్న విమాన ప్రమాదాలు | Sakshi
Sakshi News home page

నీడలా వెంటాడుతున్న విమాన ప్రమాదాలు

Published Sun, Dec 28 2014 10:17 AM

నీడలా వెంటాడుతున్న విమాన ప్రమాదాలు

హైదరాబాద్: అందేంటోగాని ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణీకులను ప్రమాదాలు నీడలా వెంటాడుతున్నాయి .... ఓ విమానం అదృశ్యమైంది... దాని జాడ ఇప్పటికి తెలియలేదు. మరో విమానాన్ని వేర్పాటు వాదులు క్షిపణులతో కూల్చివేశారు. మరో విమానం అదృశ్యం. అలాగే మరో విమానం కుప్పకూలింది.

ఆదివారం ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానం క్యూజెడ్ 8501 గగనతలం నుంచి అదృశ్యమైంది. సురబయా నుంచి సింగపూర్ బయలుదేరిన ఈ విమానం కొద్ది సేపటికే  విమానాశ్రయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయని ఇండొనేసియా మీడియా ప్రకటించింది. ఈ అదృశ్యమైన విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలపి 162 మంది ఉన్నట్లు సమాచారం.

ఈ ఏడాది వరుసగా ...
*మార్చి 8వ తేదీన ఎమ్హెచ్ 370 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్కు బయలుదేరింది. ఈ విమానం బయలుదేరిన కొద్ది గంటకే ఆ విమానం కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ రాడార్ స్క్రీన్ నుంచి మాయమైంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 225 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది మొత్తం 237 మంది గల్లంతయ్యారు. ఆ విమాన ఆచూకీ కోసం... ప్రపంచదేశాలు ఏకమై జల్లెడ పట్టిన ఇంత వరకు ఆ విమానం జాడ తెలియలేదు.

* జూలై 17న ఎమ్ హెచ్ 17 విమానం నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్ నుంచి మలేసియా రాజధాని కౌలాలంపూర్‌కు బయలుదేరింది. ఈ విమానం ఉక్రెయిన్ గగనతలంలోకి ప్రవేశించగానే ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారుల శక్తిమంతమైన  క్షిపణితో దాడి చేశారు. దాంతో విమానం కుప్పకూలింది. ఈ విమాన ప్రమాదంలో మొత్తం 298 మంది మరణించారు.

* జూలై 23న ట్రాన్స్‌ఏసియా ఎయిర్‌వేస్ విమానం తైవాన్‌లో కుప్పకూలింది.ఈ దుర్ఘటనలో 51 మంది మరణించారు.

* ఆగస్టు 10న  టెహ్రాన్లోని మెహ్రాబాద్ విమానాశ్రయం నుంచి దక్షిణ ఖొరసాన్ ప్రావిన్స్ లోని టబాస్ నగరానికి బయలుదేరిన టబాన్ ఎయిర్ లైన్స్ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందారు.

* ఆగస్టు 25న ఎండీ -83 బుర్కినా ఫాసో రాజధాని ఔగాడౌగో నుంచి అల్జీరియా రాజధాని అల్జీర్స్‌కు విమానం బయలుదేరింది. విమానం బయలుదేరిన 50 నిమిషాల అనంతరం ఏటీసీతో సంబంధాలు తెగిపోయింది. విమానంలో 50 మందికిపైగా ఫ్రాన్స్ జాతీయులు, 27 మంది బుర్కినా ఫాసో జాతీయులతోపాటు మరో 12 దేశాలకు చెందిన ప్రయాణికులు మృతి చెందారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement