ప్లాట్ఫారం మూసివేత.. హెల్ప్లైన్ నంబర్ల ప్రకటన | Sakshi
Sakshi News home page

ప్లాట్ఫారం మూసివేత.. హెల్ప్లైన్ నంబర్ల ప్రకటన

Published Thu, May 1 2014 9:52 AM

ప్లాట్ఫారం మూసివేత.. హెల్ప్లైన్ నంబర్ల ప్రకటన

చెన్నై రైల్వే స్టేషన్లో నిలిచి ఉన్న గౌహతి ఎక్స్ప్రెస్లో బాంబు పేలుడు అనంతరం తొమ్మిదో నెంబరు ప్లాట్ఫారాన్ని మూసేశారు. బాంబు పేలుడు ఫలితంగా రెండు బోగీలతో పాటు ప్లాట్ఫారం కూడా పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ప్లాట్ఫారాన్ని పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. రైల్లో మరిన్ని బాంబులు ఏమైనా ఉన్నాయేమోనని పోలీసులు క్షుణ్ణంగా గాలించారు. చెన్నై వస్తున్న పలు రైళ్లను ఇతర స్టేషన్లలో ఆపేశారు. చెన్నై సెంట్రల్ స్టేషన్కు వెళ్లే దారులన్నీ హడావుడిగా మారిపోయాయి.

మరోవైపు బెంగళూరు, చెన్నైలలో భారతీయ రైల్వే శాఖ హెల్ప్లైన్ నెంబర్లను ఏర్పాటుచేసింది. ప్రయాణికులు గానీ, వారి బంధువులు గానీ సంప్రదించేందుకు వీలుగా ఈనెంబర్లు ప్రకటించింది. పేలుడుకు కారణం ఏంటన్న విషయం ఇంతవరకు నిర్ధారణ కాలేదని తమిళనాడు డీజీపీ కె.రామానుజం తెలిపారు.

బెంగళూరు వాసులు అయితే 080- 22876288, చెన్నై వాసులు అయితే 044 25357398 నెంబర్లలో సంప్రదించవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement