స్వల్ప నష్టాల్లో మార్కెట్లు | Sakshi
Sakshi News home page

స్వల్ప నష్టాల్లో మార్కెట్లు

Published Fri, Sep 23 2016 10:16 AM

Profit booking dents equity markets

ముంబై:   మిశ్రమ అంతర్జాతీయమార్కెట్ల సంకేతాలు, ప్రాఫిట్ బుకింగ్ కారణాలతో దేశీయస్టాక్ మార్కెట్లు  ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి.  సెంటిమెంట్ బలహీనంగా ఉండడటంతో సెన్సెక్స్ 37 పాయింట్ల నష్టంతో 28,375 వద్ద, నిఫ్టీ 12 పాయింట్ల నష్టంతో 8855 వద్ద ట్రేడవుతోంది.     ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆటో, ఐటీ, ఎఫ్ ఎంసీజీ, పవర్  స్టాక్స్ లలో అమ్మకాల ఒ త్తడి నెలకొంది. రిలయన్స్ క్యాపిటల్ టాప్ గెయినర్ గా ఉంది.  శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్,భారత్ ఫోర్జ్, ఐడీఎఫ్ సీ బ్యాంక్, బజాజ్ ఫిన్ లాభపడుతండగా,  బ్యాంకింగ్ షేర్లు నష్టపోతున్నాయి.
 అటు కరెన్సీమార్కెట్లో డాలర్ తో పోలిస్తే రూపాయి 0.04 పైసల నష్టంతో ఉంది.  ఎంసీఎక్స్ మార్కెట్ లో 10  గ్రా.పుత్తడి 102  రూపాయల లాభంతో 31, 230 వద్ద ఉంది.
 

Advertisement
Advertisement